సుదీర్ఘ విరామం తర్వాత బుల్లితెర నటి, యాంకర్ ఉదయభాను (Udhayabhanu) తిరిగి వెండితెరపై కనిపించబోతున్నారు. ఒకప్పుడు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె, వెండితెరపై కూడా పలు చిత్రాలలో, ప్రత్యేక గీతాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఉదయభాను, ఎన్ని కథలు వచ్చినా తిరస్కరిస్తూ వచ్చారట. కానీ ఇప్పుడు ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రను ఒప్పుకున్నారు. ఈ చిత్రంలో ఆమె పద్మక్క అనే స్వతంత్ర, బలమైన మహిళా పాత్రను పోషిస్తున్నారు.
Sanjeevini : ఏపీలో ‘సంజీవని’ పేరుతో కొత్త అంబులెన్సులు
‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik ) సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో చిరంజీవి (Chiranjeevi) తనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని, అంతేకాకుండా తనకు మొదటి మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది కూడా ఆయనేనని ఉదయభాను తెలిపారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తమ సినిమా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇది ఆమెకు చిరంజీవి ఇచ్చిన ఒక మెగా గిఫ్ట్‌గా భావించవచ్చు.
BC Reservations : ఢిల్లీలో రేవంత్ సర్కార్ ధర్నా..42% సాధించేనా?
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కూడా చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడారు. చిరంజీవి ఒక సంపూర్ణ నటుడని, ఆయన ఏ పాత్ర చేసినా, కామెడీ, యాక్షన్, డ్యాన్స్ ఇలా ఏది చేసినా పరిపూర్ణంగా ఉంటుందని కొనియాడారు. అలాంటి గొప్ప నటుడి పుట్టినరోజు నాడు తమ సినిమా విడుదల కావడం ఒక శుభసూచకమని సత్యరాజ్ అన్నారు. ఈ సినిమాను దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కిస్తుండగా, మారుతి సమర్పణలో విజయ్ పాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.