Site icon HashtagU Telugu

Chiru 157th Film : అట్టహాసంగా చిరు – అనిల్ మూవీ ఓపెనింగ్

Chiru157

Chiru157

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కనున్న “మెగా 157” (Mega157)చిత్రం ఉగాది (Ugadi) సందర్భంగా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, బాబీ, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ ఓదెల తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటుడు వెంకటేష్ క్లాప్‌ కొట్టడంతో ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

New Scheme : తెలంగాణ లో నేడు మరో పథకం అమలు

అనిల్ రావిపూడి ఇటీవలే “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని, ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఈ మూవీ షూటింగ్ ను త్వరగా మొదలుపెట్టి.. సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌ సంగీతాన్ని అందించనుండగా, చిరంజీవి పాత్ర “ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు” తరహాలోనే మాస్ అప్పీల్‌తో ఉండనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో పరిణితీ చోప్రా, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటించనున్నారని వార్తలు వచ్చినప్పటికీ, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.