Chiranjeevi: వాల్తేరు వీరయ్య సినిమా రేటింగ్‎పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్.. ఏం అన్నారంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 02:31 PM IST

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ కు ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి.. ఆ మధ్య సినిమాలకు గ్యాప్ ఇవ్వడం తెలిపిందే. 10 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. సాలిడ్ హిట్ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు. అయితే తాజాగా సంక్రాంతి బరిలో నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’ ఆ లోటును తీర్చింది.

మెగాస్టార్ చిరంజీవి స్థాయికి తగ్గ హిట్ అది అని చెప్పుకోదగిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13వ తేదీన సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. వింటేజ్ చిరంజీవిని డైరెక్టర్ బాబి మరోసారి తెర మీద ఆవిష్కరించాడు. చిరంజీవి అంటేనే ఎంటర్టైన్మెంట్ కి ‘వాల్తేరు వీరయ్య’లో పూర్తిన్యాయం చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి తన సినిమాకు కొన్ని వెబ్ సైట్లు ఇచ్చిన రేటింగ్ మీద ఫన్నీగా కామెంట్లు చేశారు. తనకు ఆ రేటింగ్స్ ఎందుకిచ్చారనే విషయం ముందు అర్థం కాలేదని, కానీ తర్వాత అర్థమైందని చిరంజీవి అన్నాడరు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఒక చిన్న జోక్‌ చెప్తాను.. ఎవరినీ విమర్శించడానికి కాదు, సరదాగా తీసుకోండి. కొన్ని వెబ్‌సైట్లు వాల్తేరు వీరయ్యకు 2, 2.5 రేటింగ్‌ ఇచ్చాయి’ అని వివరించాడు.

తన మాటలను కొనసాగిస్తూ చిరంజీవి.. ‘అయినా సరే నేను సినిమాపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. సినిమాలో మంచి మాస్‌ మసాలా కంటెంట్‌ ఉంది. గ్యాంగ్‌ లీడర్‌, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య.. ఇలాంటి సినిమాల్లో ఎంత ఫన్‌ ఉందో అంతే ఫన్‌ ఈ సినిమాలో ఇచ్చాం. సినిమా చూస్తే ప్రేక్షకుడి కడుపు నిండిపోతుంది. వారిచ్చే రేటింగ్‌ పట్టించుకోకూడదనుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది. 2.25 రేటింగ్‌ అంటే 2.25 మిలియన్స్‌ అని తర్వాత తెలిసొచ్చింది. మేము అర్థం చేసుకోవడంలో పొరపడ్డామని గ్రహించాం’ అని చిరంజీవి వ్యంగ్యంగా కామెంట్ చేశారు.