Site icon HashtagU Telugu

Chiranjeevi Properties: ‘రియల్’ స్టార్.. చిరంజీవి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chiranjeevi property

Chiru

చిరంజీవి (Chiranjeevi)… నటనలోనే కాదు.. ఆస్తుల్లోనూ మెగాస్టార్ అని అనిపించుకుంటున్నారు. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ టాలీవుడ్ మెగాస్టార్ 1660 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నారు. మెగాస్టార్ గా తనను తానుగా ఎదిగిన చిరంజీవికి హైదరాబాద్ (Hyderabad), ఇతర నగరాల్లో అనేక ఖరీదైన ఆస్తులున్నాయి. చిరంజీవి ఇటీవల సిటీ ఆఫ్ నిజామ్స్‌లో కొత్త విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేసినట్టు, రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ వర్గాల ప్రకారం.. చిరంజీవికి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఖరీదైన ప్రాంతం అయిన ఎమ్మెల్యే కాలనీలో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన తన కూతురు శ్రీజ కొణిదెలకు ఖరీదైన ఆస్తిని బహుమతిగా ఇచ్చారని సమాచారం. దీని విలువ రూ. 35 కోట్లు అని తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టులో చిరంజీవి (Chiranjeevi) హైదరాబాద్‌లోని తన విలువైన ఆస్తిని విక్రయించినట్లు సమాచారం. 1990లలో ఫిలింనగర్‌లోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న భారీ భూమిని కొనుగోలు చేసినట్లు టాక్. అయితే తన భూమిని రూ. 70 కోట్ల భారీ ధరకు విక్రయించాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఖరీదైన ఇల్లు

మెగాస్టార్ (Chiranjeevi) ప్రస్తుతం ఉంటున్న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటున్నాడు. ఈ ఇంటి ధర దాదాపు రూ. 28 కోట్లు. అన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మించుకున్న ఇల్లు కూడా. చిరంజీవి వారసత్వ కట్టడాలు మాదిరిగా తన ఇంటిని డిజైన్ చేసుకున్నాడు. ఇంటి ముందు భారీ గార్డెన్ కూడా ఉంటుంది. ఇక చిరంజీవి గ్యారేజీలో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇలా.. అన్నీ వసతులతో చిరంజీవి ఇల్లు ఓ ఇంద్రభవనం లా ఉంటుంది.

చిరు సినిమాలు ఇవే

ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) విడుదలకు సిద్దంగా ఉంది. మెహర్ రమేష్ సినిమా భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఏప్రిల్ 2023లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరికొన్ని సినిమా కథను వింటున్నాడు. వాల్తేరు వీరయ్య విజయంపై ధీమా ఉన్న చిరంజీవి ఇప్పటికే ఆ చిత్ర యూనిట్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు.

Also Read: Michael Releasing: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ‘మైఖేల్’ రిలీజ్ కు రెడీ!

Exit mobile version