Site icon HashtagU Telugu

Chiranjeevi : ‘తప్పనిసరిగా ఓటు వేయండి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపు

Indrasena Reddy vs Samara Simha Reddy Chiranjeevi Speech at Balakrishna 50 years film festival

Indrasena Reddy vs Samara Simha Reddy Chiranjeevi Speech at Balakrishna 50 years film festival

అతి త్వరలో పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ (Chiranjeevi) ఓటు హక్కు ప్రాధాన్యం తెలుపుతూ ట్వీట్ చేశారు. “మనదేశ 18వ లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయసు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు మన రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం వినియోగించండి.. తప్పనిసరిగా ఓటు వేయండి” అంటూ చిరంజీవి యువ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ కు త్వరలో కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని గతంలో ఉహాగానాలు రాగా.. తాజాగా ఆయన ప్రధాని మోడీ ట్వీట్ కు రిప్లై ఇవ్వడం తో మరోసారి అలాంటి చర్చకు దారి తీసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి చిరంజీవి తమ్ముడు , సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పవన్..ఈసారి లోక్ సభ తో పాటు అసెంబ్లీ కి పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఎన్నికల్లో విజయం సాధిస్తే బిజెపి కేంద్ర మంత్రి ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు. మరి ఇది వరకు నిజమో తెలియాల్సి ఉంది. అలాగే ఈసారి పవన్ కళ్యాణ్ కు చిత్రసీమ నుండి మద్దతు ఇస్తారో లేదో అనేది కూడా ఆసక్తి గా మారింది. ఇంతవరకు పేరున్న ప్రముఖులు పవన్ కు మద్దతు ఇచ్చింది లేదు..పవన్ కూడా ఏనాడూ మద్దతు అడిగింది కూడా లేదు. కాకపోతే ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అనేలా ఉండడం తో ఎవరైనా మద్దతు ఇస్తారో లేదో..కనీసం మెగా ఫ్యామిలీ సపోర్ట్ అయినా పవన్ తీసుకుంటారో లేదో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Also : Gudivada: గాజువాక బరిలో గుడివాడ అమర్ నాథ్?