Site icon HashtagU Telugu

Happy Birthday Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు చిరంజీవి ఎమోషనల్ బర్త్ డే విషెస్ …!!

Pawan And Chiru

Pawan And Chiru

పవన్ కల్యాణ్….చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సాధించిన ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేసి జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏపీ రాష్ట్రానికి సీఎం కావాలన్న తపనతో ముందుకుసాగుతున్నారు. ఇవాళ పవన్ పుట్టినరోజు. పలువురు ప్రముఖులు, సినీరంగప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు జల్సా రీ రిలీజ్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కు చేసిన ఓ ఎమోషనల్ విషెస్ ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తన ఆశ, ఆశయం ఎప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీ చిత్తశుద్ధితో శ్రమిస్తారు. పవన్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ కల్యాణ్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ గ్రాండ్ విషెస్ తెలియజేశారు.