Chiranjeevi: అమ్మ గురించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్.. ఇంతకీ ఏం పెట్టాడంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు ఉన్న కుటుంబాల జాబితాలో మెగా కుటుంబం ఒకటి.

Published By: HashtagU Telugu Desk
Fnortvaakaimbfr 1674987271

Fnortvaakaimbfr 1674987271

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు ఉన్న కుటుంబాల జాబితాలో మెగా కుటుంబం ఒకటి. మెగాస్టార్ చిరంజీవి వల్ల ఈ కుటుంబానికి సినీ ఇండస్ట్రీలో గుర్తింపు రాగా.. ఇప్పుడు చాలామంది మెగా హీరోలు తమకంటూ సొంత గుర్తింపును సాధించారు. కాగా తాజాగా చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు వేడుకలు మెగా ఫ్యామిలీ అందరూ కలిసి గ్రాండ్ గా చేశారు.

అంజనా దేవి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో పాటు మిగిలిన మొత్తం కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, టవర్ స్టార్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో పాటు అంజనా దేవి ఇద్దరు కూతుళ్లు దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి.. ‘మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటా.. హ్యాపీ బర్త్ డే అమ్మ’ అని పోస్ట్ చేశాడు. ఈ కార్యక్రమంలో మెగా హీరోల కుటుంబాలతో పాటు కుటుంబీకులు అందరూ పాల్గొన్నారు. అయితే రామ్ చరణ్, ఉపాసనలు మాత్రం అంజనాదేవి పుట్టిన రోజును ముద్దు పెట్టి మరీ విష్ చేశారు.

కాగా చిరంజీవి షేర్ చేసిన ఫోటోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ మరోసారి చర్చకు దారితీసింది. ఈ మధ్యనే క్లీన్ షేవ్ తో కనిపించిన పవన్.. తాజా ఫోటోలో నెరిగిన గడ్డంతో, బ్లాక్ టీ షర్ట్ తో కనిపించాడు. కాగా ప్రస్తుతం చిరంజీవి ‘భోళాశంకర్’, రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటం తెలిసిందే. పవన్ అటు సినిమాలతో పాటు పాలిటిక్స్ లో బిజీగా ఉండగా.. ఆయన సినిమా ‘హరిహరవీరమల్లు’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది.

  Last Updated: 29 Jan 2023, 09:37 PM IST