Site icon HashtagU Telugu

Yamudiki Mogudu : 36ఏళ్ళ ‘యముడికి మొగుడు’.. ఇప్పటి హీరో తండ్రే ఆ సినిమా దర్శకుడు..

Chiranjeevi Yamudiki Mogudu Is Directed By Aadhi Pinisetty Father Ravi Raja

Chiranjeevi Yamudiki Mogudu Is Directed By Aadhi Pinisetty Father Ravi Raja

Yamudiki Mogudu : మెగాస్టార్ చిరంజీవి దశబ్దాల ప్రయాణంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్నారు. అందులో ఒకటి ‘యముడికి మొగుడు’. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం.. 1988 ఏప్రిల్ 29న రిలీజయ్యి పాత రికార్డులన్నీ బ్రేక్ చేసింది. నేటితో ఈ చిత్రం 36ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను మీకు కోసం తీసుకు వస్తున్నాము. ఈ ఆర్టికల్ చదివేసి ఆ విషయాలేంటో తెలుసుకోండి.

చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ యముడి పాత్రని పోషించారు. రాధా, విజయశాంతి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసారు. ఈ పేరు వినగానే మీకు ఇప్పటి హీరో పేరు గుర్తుకు వచ్చే ఉండాలి. అవును ఈ దర్శకుడు హీరో అది పినిశెట్టి తండ్రి. సౌత్ లోని పలు భాషల్లో సినిమాలు తెరకెక్కించిన రవిరాజా పినిశెట్టి.. తెలుగు చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్, బాలయ్యతో కూడా సూపర్ హిట్ సినిమాలను, ఇండస్ట్రీ హిట్స్‌ని ఇచ్చారు.

ఇక యముడికి మొగుడు సినిమా విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రముఖ నటులు సుధాకర్, నారాయణ రావు, చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లో రూమేట్స్ గా ఉండేవారు. కెరీర్ లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఈ పైకి ఎదుగుతూ వచ్చారు. చిరంజీవి పెద్ద హీరోగా ఎదగగా, సుధాకర్ అండ్ నారాయణ రావు మంచి నటులుగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే పెద్ద హీరోగా ఎదిగిన చిరంజీవి.. తన మిత్రులను కూడా తనతో పాటు ఎత్తుకి తీసుకు వెళ్లాలని వారికీ నిర్మాతగా అవకాశం ఇచ్చారు.

డైనమిక్ మూవీ మేకర్స్ అని చిరంజీవే ఆ నిర్మాణ సంస్థకి నామకరణం చేసి యముడికి మొగుడు సినిమా అవకాశం ఇచ్చారు. సత్యానంద్ స్టోరీ, రవిరాజా దర్శకత్వం, రాజ్ కోటి సంగీతం బాక్స్ ఆఫీస్ వద్ద మెప్పించి ఇండస్ట్రీ హిట్టుని సొంతం చేసాయి. ఈ సినిమాతోనే రాజ్ కోటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. ఇక సుధాకర్ సినిమాని నిర్మిస్తూనే.. చిరంజీవి బలవంతం పై కమెడియన్ రోల్ చేసారు. అది బాగా క్లిక్ అయ్యి.. సుధాకర్ ని స్టార్ కమెడియన్ ని చేసింది.

Also read : Ram Charan : రామ్ చరణ్ RC16 షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట..