Site icon HashtagU Telugu

Chiranjeevi : ఫోటో చెబుతున్న సీక్రెట్.. సినిమా అనౌన్స్ చేయడమే లేట్..!

Chiranjeevi With Star Producer Photo Secret

Chiranjeevi With Star Producer Photo Secret

Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం చిరంజీవి యువ దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మెగా 157 రేసులో ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ వస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ బ్యానర్ తో చిరు పెద్ద కూతురు సుస్మిత కలిసి ఓ సినిమా చేయనున్నారట.

రీసెంట్ గా చిరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తే వీరి కాంబినేషన్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ బ్యానర్ లో వచ్చే సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం తెలియట్లేదు.

అంతకుముందు కళ్యాణ్ కృష్ణ, వెంకీ కుడుముల ఇద్దరితో సినిమా చేస్తాడని చిరు డిస్కషన్స్ చేయగా కథ ఓకే అనిపించేలా ఉన్నా కథనం విషయంలో సాటిస్ఫై అవ్వక చిరు ఆ ప్రాజెక్ట్ లను హోల్డ్ లో పెట్టారు. మరి ఇప్పుడు పీపుల్ మీడియాతో చిరు చేస్తున్న సినిమాకు డైరెక్ట్ ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి యువ దర్శకులతోనే సినిమాలు చేయాలని కోరుతున్నారు.