Site icon HashtagU Telugu

Chiru wishes Sam: డియర్ సామ్ త్వరగా కోలుకోండి.. సమంత హెల్త్ పై చిరు ట్వీట్!

Sam And Chiru

Sam And Chiru

స్టార్ నటి సమంత చాలా రోజులుగా అరుదైన వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే అఖిల్ అక్కినేని, ఎన్టీఆర్ సామకు ధైర్యం చెప్పారు. తాజాగా ఆదివారం మెగాస్టార్ చిరంజీవి సమంత త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ ఓ పోస్ట్ పెట్టారు. “డియర్ సామ్, కాలానుగుణంగా, మన జీవితాల్లో సవాళ్లు వస్తాయి, బహుశా మన స్వంత అంతర్గత శక్తిని కనుగొనడానికి వీలు కల్పిస్తుంది. మీరు అంతకన్నా ఎక్కువ అంతర్గత బలంతో ఉన్న అద్భుతమైన అమ్మాయి.

నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. మీరు  ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అతి త్వరలో సమస్య నుంచి పడతారు ! దేవుడు నీ తోడు ఉండు గాక!” అంటూ ట్వీట్ చేశారు. సామ్ త్వరగా కోలుకోవాలని మరియు తన అద్భుతమైన నటనతో మళ్లీ వారి హృదయాలను గెలుచుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. సమంత తదుపరి చిత్రం యశోద నవంబర్ 11, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.