మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ప్రజల గుండెల్లో నిలిచాడో, ఆయన కృషి చూసినవారికి అర్థమవుతుంది. తాజాగా రీ రిలీజ్ కు సిద్దమైన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘అబ్బ నీ తీయని దెబ్బ’ అనే పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ, షూటింగ్‌ను ఆపకుండా డెడికేషన్‌తో పనిచేయడం అప్పుడు , ఇప్పుడు సినీ ప్రేమికులందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి షాట్ తరువాత ఆయన్ని ఐస్ ప్యాక్స్‌తో చల్లబరిచినా, ఆయన మాత్రం ఆ పాటను పూర్తిచేయడమే లక్ష్యంగా పెటుకున్నారట..అలాగే శ్రీదేవికి కేవలం రెండు రోజుల కాల్షీట్స్ మాత్రమే ఉండటంతో చిరు తన ఆరోగ్యాన్ని పక్కనబెట్టి పాట పూర్తి చేయాల్సి వచ్చిందని మేకర్స్ తెలిపారు.
Kashmir Jails : జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర.. ఉగ్రవాదులను విడిపించేందుకు స్కెచ్ ?
అలాంటి ఈ క్లాసిక్ మూవీ మే 9, 1990న విడుదలై అప్పట్లోనే ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు 35 సంవత్సరాల అనంతరం అదే తేదీన, మే 9, 2025న ఈ చిత్రం మళ్లీ రీ-రిలీజ్ కానుంది. అప్పట్లో టికెట్ ధరలు రూ.6 మాత్రమే ఉండగా, సినిమా హిట్టయ్యాక మ్యాట్నీ షోలు రూ.210 వరకు అమ్ముడయ్యాయి. చిరంజీవి టూరిస్ట్ గైడ్ పాత్రలో, శ్రీదేవి ఇంద్రజ పాత్రలో కనిపించగా, అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.