Chiru Vs Ravi Teja: వీరయ్య క్రేజీ అప్డేట్.. ‘పూనకాలు లోడింగ్’ కమింగ్

మెగాస్టార్ (Chiranjeevi), మాస్ మహారాజ కలిసి నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ జోరు పెంచింది.

Published By: HashtagU Telugu Desk
Chiru And Veeraiah

Chiru And Veeraiah

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో సాంగ్ రాబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పూనకాలు లోడింగ్ న్యూ ఇయర్ ప్రెజెంటేషన్‌గా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. చిరంజీవి(Chiranjeevi), రవితేజ (Ravi teja) ఒకరి కళ్లలోకి ఒకరు సీరియస్‌గా చూస్తున్న ఈ పోస్టర్ ద్వారా పాటపై అధికారిక ప్రకటన వెలువడింది.

చిరంజీవి (Chiranjeevi) గల్లా చొక్కా, చిరిగిన జీన్స్‌తో మాస్ అవతార్‌లో కనిపిస్తుండగా, రవితేజ ట్రెండీ దుస్తుల్లో మోడ్రన్ గా కనిపిస్తున్నాడు. వీరిద్దరినీ కలిసి తెరపై చూడటానికి రెండు కళ్లు చాలవు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. గతంలో విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇద్దరు పెద్ద స్టార్లు ఒకే పాటలో దుమ్మురేపుతుండటంతో  పూనకాలు లోడింగ్ గత రికార్డులను బీట్ చేయడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Anant Ambani and Radhika Merchant: పెళ్లి పీటలెక్కబోతున్న అంబానీ వారసుడు.. రాధిక మర్చంట్ తో ఎంగేజ్ మెంట్!

  Last Updated: 29 Dec 2022, 03:50 PM IST