Site icon HashtagU Telugu

Chiru Vs Rajini: మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. భోళా శంకర్ కు ‘జైలర్’ ఛాలెంజ్!

Chiru And Rajani

Chiru And Rajani

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలు ఒకేసారి విడుదలైతే అభిమానులకు పండుగ లాంటిదే. ఇప్పటి వరకు రజనీ, చిరంజీవి సినిమాలు పోటీగా విడుదల కాలేదు. కానీ 2023లో మాత్రం ఇది తప్పేలా లేదు. భోళా శంకర్ ఏప్రిల్ 14 విడుదల తేదీగా ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అజిత్ తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద ఫ్యాన్స్ కి ఏమంత ఆశలు లేవు కానీ రమేష్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తాజాగా రజని నటిస్తున్న జైలర్ ని సైతం ఏప్రిల్ 14నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెన్నై టాక్.

త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో డాక్టర్, బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ మూవీలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్ర చేయడం లాంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. పేట తర్వాత అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న తలైవర్ మూవీ కూడా ఇదే. వరసగా ఎన్ని డిజాస్టర్లు పడుతున్నా అంచనాల విషయంలో తగ్గేదేలే అంటూ రేంజ్ మైంటైన్ చేస్తున్న రజని కుర్ర దర్శకులతో వరసగా జోడి కడుతూనే ఉన్నారు ఇంకా అయిదు నెలల సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చు కానీ ఇంత అడ్వాన్స్ గా రిలీజ్ డేట్లు చెప్పుకుంటే తప్ప సాఫీగా విడుదల కాని పరిస్థితులు నెలకొన్నాయి.

రోబో తర్వాత ఆ స్థాయి హిట్టు తెలుగులో లేక రజని మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. మరోవైపు చిరంజీవి సైతం ఖైదీ నెంబర్ 150 తర్వాత అంత విజయం మళ్ళీ అందుకోలేదు. సైరా ఓవరాల్ గా నష్టాలు తేగా, ఆచార్య డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ తోనూ యావరేజ్ కావడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో భోళాశంకర్, జైలర్ సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. మరి రజనీపై చిరంజీవి పైచేయి సాధించేనా అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version