Site icon HashtagU Telugu

Chiranjeevi Viswambhara : విశ్వంభర టీం వాటి పైనే ఫుల్ ఫోకస్..!

Megastar Chiranjeevi Viswambhara Business Deals

Megastar Chiranjeevi Viswambhara Business Deals

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన నెక్స్ట్ సినిమా వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిరు వింటేజ్ లుక్ అదిరిపోతుందని అంటున్నారు. చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి (Jagadeka Veerudu Athiloka Sundari) తరహా లోనే ఈ సినిమా కూడా ఉంటుందని చిత్ర యూనిట్ లో చెప్పుకుంటున్నారు.

వశిష్ట మొదటి సినిమా బింబిసార కూడా విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు. ఐతే ఈ సినిమా దానికి మించిన స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర (Viswambhara) సినిమా ఎక్కువగా గ్రాఫిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని తెలుస్తుంది. విశ్వంభర సినిమా లో కూడా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది.

ఈమధ్య ఇలాంటి సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. హనుమాన్, కల్కి సినిమాలు చూసిన ఆడియన్స్ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ సినిమాల్లో ఉంటే ఆ రేంజ్ అవుట్ పుట్ కావాలని అంటున్నారు. అందుకే విశ్వంభర సినిమా టీం కూడా దాని మీదే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. విశ్వంభర సినిమా లో చిరుని మరోసారి చాలా ఎనర్జిటిక్ పాత్రలో చూడబోతున్నామని తెలుస్తుంది.

సినిమాకు కీరవాణి (Keeravani) మ్యూజిక్ అందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ ఇంకా ఈషా చావ్లా కూడా నటిస్తుందని తెలుస్తుంది. 2025 సంక్రాంతి (Sankranti) కానుకగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా చేసిన చిరు మీద కొందరు ఆడియన్స్ విపరీతమైన ట్రోల్స్ చేశారు. అందుకే చిరు ఈసారి నెక్స్ట్ లెవెల్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. చిరంజీవి విశ్వంభర సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా వశిష్ట నేషనల్ లెవెల్ ఆడియన్స్ రీచ్ పొందేలా చేస్తాడని అంటున్నారు.