Chiranjeevi Ram Charan మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చిరు జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో విజువల్ వండర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు.
చిరంజీవి విశ్వంభర (Vishwambhara) సినిమాను జనవరి 10 2025 రిలీజ్ లాక్ చేశారు. ఐతే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ సినిమాను మార్చి లేదా ఏప్రిల్ కి వాయిదా వేసే ప్లానింగ్ లో ఉన్నారట. చరణ్ (Ram Charan) నటించిన గేమ్ చేంజర్ అసలైతే క్రిస్మస్ కి రావాలని అనుకుంటున్నా ఆల్రెడీ ఆ డేట్ కి సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశారు కాబట్టి మరో డేట్ ని చూడాలని అనుకుంటున్నారు. అందుకే సంక్రాంతికి అయితే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.
చరణ్ సినిమా సంక్రాంతికి వస్తే..
ఆల్రెడీ సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పాటు బాలయ్య 109వ సినిమా కూడా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే చరణ్ సినిమా సంక్రాంతికి వస్తే మాత్రం చిరంజీవి విశ్వంభర వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మరి గేమ్ చేంజర్ క్రిస్ మస్ కి వస్తుందా లేదా సంక్రాంతికి వాయిదా పడుతుందా అన్నది చూడాలి.
ఆచార్య ఫ్లాప్ తర్వాత చరణ్ నటించిన చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఇండియన్ 2 ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఈ సినిమాతో శంకర్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.