Site icon HashtagU Telugu

Chiranjeevi : చిరంజీవిని చూసి యంగ్ హీరోలు నేర్చుకోవాలి..

Chiranjeevi

Chiranjeevi

చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరంజీవి 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ తాలూకా క్రేజీ అప్డేట్ ఇప్పుడు చిరంజీవి శ్రద్ద ఫై ఆసక్తి పెంచుతుంది. ప్రస్తుతం చిరంజీవి వయసు 68 ఏళ్లు. అయినప్పటికీ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోవడం కాదు..యంగ్ హీరోలే చిరంజీవిని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. దీనికి కారణం సినిమా షూటింగ్ లపై ఆయన పెడుతున్న శ్రద్ద.

ఇటీవల కాలంలో యంగ్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు..అలాంటిది చిరంజీవి ఏడాదికి రెండు సినిమాలను లైన్లో పెడుతూ..సినిమాలపై తనకున్న ఫ్యాషన్ ను చెప్పకనే చెపుతున్నారు. దీనికి ఉదాహరణే విశ్వంభర మూవీ. సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లో చిరంజీవి ఎంతో ఉత్సహంగా పాల్గొనడమే కాదు సినిమా షూటింగ్ ను సైతం శరవేగంగా పూర్తి చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

కొన్నాళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. మధ్యలో ఎన్నికలు రావడంతో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ లో కూడా ఆయన కనిపించాడు. అంటే ఇంకా కొన్ని రోజులు పడుతుందనుకున్నారు. కానీ ఈ లోగానే టాకీ పూర్తి కావడం అంటే చిన్న విషయం కాదు. వింటేజ్ హీరోల డెడికేషన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మెగాస్టార్ మరోసారి ప్రూవ్ చేశాడు. అయితే ఓ రెండు పాటలతో పాటు క్లైమాక్స్ ఫైట్ మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉన్నాయట. ఈ మొత్తం కూడా ఆగస్ట్ నెలలో పూర్తి చేసేలా ప్లానింగ్ తో ఉన్నారు.

బింబిసారతో ఆకట్టుకున్న వశిష్ట విశ్వంభర సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. బింబిసార లాగానే ఇది కూడా సోషియో ఫాంటసీ మూవీ కావడం విశేషం. త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మరో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు వినికిడి. ఇది వేర్వేరు లోకాల చుట్టూ సాగే కథ కాబట్టి.. ఆయా లోకాల్లోని దేవ కన్యలుగా వారంతా కనిపించబోతున్నారు అని ఫిలిం వర్గాలు అంటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవి మళ్లీ సోషియో ఫాంటసీ చేయలేదు. అందుకే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ మూవీపై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..మెగా ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో కిక్ ఇస్తుందో చూడాలి.

Read Also : Telangana Panchayat Elections : పంచాయతీ ఎన్నికలఫై మంత్రి పొంగులేటి క్లారిటీ