Chiranjeevi : వెంకటేష్ బంధువుని గెలిపించాలంటూ.. చిరంజీవి వీడియో కాంపెయిన్..

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ బంధువుని ఏపీ ఎన్నికల్లో గెలిపించాలంటూ.. చిరంజీవి వీడియో కాంపెయిన్ చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi Video Campaign For Venkatesh Relative Nda Mla Kamineni Srinivas

Chiranjeevi Video Campaign For Venkatesh Relative Nda Mla Kamineni Srinivas

Chiranjeevi : ఏపీ ఎన్నికల ప్రచారాల్లో సినీ సెలబ్రిటీస్ జోరు కనిపిస్తుంది. టీవీ నటులు నుంచి బడా స్టార్స్ వరకు చాలామంది ఏపీ ఎన్నికల ప్రచారాల్లో భాగం అవుతూ.. పొలిటికల్ హీట్ ని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా కాంపౌండ్ నుంచి జనసేనకి, కూటమికి పెద్దఎత్తున సపోర్ట్ వస్తుంది. మొన్నటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి సైతం.. తమ్ముడు పవన్ కోసం సోషల్ మీడియా కాంపెయిన్ చేస్తూ వస్తున్నారు.

ఇటీవల బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ ని గెలిపించాలంటూ.. ప్రజలను కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇక తాజాగా మరో వీడియోని కూడా రిలీజ్ చేసారు. ఇక ఈ వీడియోలో కైకలూరు కూటమి (బీజేపీ) అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ని గెలిపించాలంటూ కోరారు. ఈయన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కి బంధువు. దీంతో కామినేని శ్రీనివాస్ కోసం వెంకటేష్ కూడా ప్రచారం చేయబోతున్నారట.

అసలు కాంట్రవర్సీ విషయాలకు దూరంగా ఉండే వెంకటేష్.. ఈసారి ఏపీ ఎన్నికల ప్రచారాల్లో కనిపించబోతున్నారు. కామినేని శ్రీనివాస్ కోసం కైకలూరులో ప్రచారం చేయడానికి సిద్దమవుతున్నారట. అయితే వెంకటేష్ ఈ ఒక్క బంధువు కోసమే కాదు, మరో బంధువు అయిన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డిని కూడా సపోర్ట్ చేస్తూ కాంపెయిన్ చేయనున్నారట. మొన్నటివరకు పాలిటిక్స్ కి దూరంగా ఉన్న ఈ ఇద్దరు సీనియర్ హీరోలు.. ఇప్పుడు సడెన్ గా ఇలా రాజకీయాలు వైపు టర్న్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

అయితే కేవలం ఈ ఇద్దరు సీనియర్ హీరోలు మాత్రమే కాదు. యంగ్ హీరోలు కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తున్నారు, చేయనున్నారు. పవన్ కోసం వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్. టీడీపీ కోసం నారా రోహిత్. తన సొంత మావయ్య కోసం నిఖిల్. ఇలా యంగ్ హీరోలు కూడా పొలిటికల్ కాంపెయిన్ లో సందడి చేస్తున్నారు.

Also read : Chiranjeevi : పిఠాపురం ప్రచారానికి చిరంజీవి నిజంగా రాబోతున్నారా..? నాగబాబు ఏమన్నారు..!

  Last Updated: 27 Apr 2024, 06:35 PM IST