Chiranjeevi Venkatesh మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. 200 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటుగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. చిరు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా తరహాలోనే విశ్వంభర సినిమా ఉంటుందని తెలుస్తుంది.
విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఐతే విశ్వంభర సినిమా సెట్ లో చిరుని సర్ ప్రైజ్ చేస్తూ విక్టరీ వెంకటేష్ ఎంట్రీ జరిగింది. చిరు (Chiranjeevi), వెంకటేష్ (Venaktesh) ఇద్దరు అదిరిపోయే ఫోటో స్టిల్ ఇచ్చారు. చిరు విశ్వంభర, వెంకటేష్ సినిమా కూడా ఒకేచోట షూటింగ్ జరుపుకుంటుండగా వెంకటేష్, చిరంజీవి ఇద్దరు కలిసి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు.
విశ్వంభర రిలీజ్ విషయంలో..
వెంకటేష్, చిరంజీవితో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కూడా ఫోటోలు ఉన్నారు. చిరంజీవి, వెంకటేష్ ఈ ఇద్దరు కూడా ఈ కలయికతో తమ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. చిరంజీవి విశ్వంభర (Viswambhara) రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు కానీ వెంకటేష్ 76వ సినిమా మాత్రం కచ్చితంగా సంక్రాంతికి వస్తుందని తెలుస్తుంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనీల్ రావిపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య, వెంకటేష్ లు పోటీకి సిద్ధమవుతున్నారు.
Also Read : White Spots on Nails : గోరుపై తెల్లటి మచ్చ ఈ వ్యాధి లక్షణం, నిర్లక్ష్యం చేయకండి..!