Site icon HashtagU Telugu

Chiranjeevi – Venkatesh : అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్, వెంకీమామ..

Chiranjeevi Venkatesh Enjoying in America

Chiranjeevi Venkatesh Enjoying in America

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల తన భార్యతో కలిసి అమెరికాకు(America) వెళ్లినట్టు తన సోషల్ మీడియాలో తెలిపారు. అమెరికాలో అక్కడి తెలుగు వారు చిరంజీవికి పద్మ విభూషణ్(Padma Vibhushan) అవార్డు ప్రకటించినందుకు సన్మానం చేయనున్నారు. ప్రస్తుతం చిరంజీవి దంపతులు అమెరికాలోనే ఉన్నారు. తాజాగా వీరితో విక్టరీ వెంకటేష్(Venkatesh) కూడా కలిశారు.

అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ కోనేరు తనయుడు కిరణ్ కోనేరు వివాహానికి చిరంజీవి దంపతులు హాజరయ్యారు. అలాగే వెంకటేష్, అల్లు అరవింద్, నిర్మాతలు విశ్వప్రసాద్, నవీన్ యెర్నేని.. పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

చిరంజీవి ఆ పెళ్లి వేడుకలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా స్నేహితుడు కుమార్ కోనేరు తనయుడు కిరణ్ కోనేరు పెళ్ళిలో సందడి చేసాము. కొత్త జంటకు నా బ్లెస్సింగ్స్. ఈ వేడుకలో వెంకటేష్ కూడా మాతో కలిసాడు అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. చిరు, వెంకీమామ మళ్ళీ ఒకే వేడుకలో కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Nandu – Geetha Madhuri : మరోసారి తల్లితండ్రులైన నందు – గీతామాధురి.. పండంటి బాబు..