Site icon HashtagU Telugu

Sunita Williams On Earth: మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

Chiru Sumitha

Chiru Sumitha

ప్రసిద్ధ భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరియు బుచ్ విల్మోర్ 286 రోజుల అంతరిక్ష ప్రయాణం అనంతరం భూమిపై విజయవంతంగా తిరిగి చేరుకున్నారు. వ్యోమగాములుగా వీరిద్దరూ అనేక సవాళ్లను ఎదుర్కొని అంతరిక్ష ప్రయాణాన్ని పూర్తి చేయడం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం. 8 రోజుల ప్రయాణంగా భావించిన ఈ మిషన్ చివరకు 286 రోజులుగా మారింది. వారి విజయంతో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వ్యోమగాముల ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Mushroom: పుట్టగొడుగులు తింటే క్యాన్సర్ తగ్గుతుందా.. ఇందులో నిజమెంత?

ఈ సందర్భాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎంతో ఉత్సాహంగా స్వాగతించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల తిరుగు ప్రయాణాన్ని ఒక గ్రాండ్ అడ్వెంచర్‌గా అభివర్ణించారు. “వీరి ప్రయాణం ఏదైనా థ్రిల్లింగ్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా కన్నా తక్కువేమీ కాదు” అని చిరంజీవి ట్వీట్ చేశారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడిపి భూమిపై విజయవంతంగా తిరిగి వచ్చిన వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

అంతరిక్ష అన్వేషణలో సునీతా విలియమ్స్ సాధించిన ఘనత భారతీయులకు గర్వకారణంగా మారింది. ఆమె మునుముందు మరింత శక్తిని పొంది మరిన్ని విజయాలు సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఇటువంటి విజయం భవిష్యత్తులో మరిన్ని యువతరాన్ని అంతరిక్ష రంగంలోకి ప్రేరేపించనుంది. ఈ ఘనత భారతీయుల సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది.