అనారోగ్యంతో కన్నుమూసిన ఈనాడు గ్రూపుల అధినేత రామోజీ రావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు (Ramojirao).. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి సినీ , రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీ లో ప్రజల సందర్శనార్థం రామోజీరావు పార్థివదేహాన్ని ఉంచారు. రేపు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కడసారి రామోజీరావు చూసేందుకు చిత్రసీమ కదిలివస్తుంది. ఇప్పటికే ఎంతోమంది ఆయనకు నివాళులు అర్పించి రామోజీరావు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి సైతం నివాళులు అర్పించి , కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. రామోజీ రావుతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తాను ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఓ పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకొని… సంబరపడ్డారని తెలిపారు. ఆయన దాచుకున్న పెన్నులను తనకు చూపించారన్నారు. రామోజీ రావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అన్నారు. తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయిందన్నారు. ఆయన సమాజహితం కోసం పని చేశారన్నారు.
Read Also : Kodali Nani : వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు – కొడాలి నాని