Site icon HashtagU Telugu

Mega Star: ‘చిరు-హరీష్ శంకర్’ కాంబో ఫిక్స్… లక్కంటే ఈ దర్శకుడిదే..!

chiranjeevi harish

chiranjeevi harish

రవితేజ హీరోగా ‘షాక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద షాక్ ఇచ్చినప్పటికీ, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మాస్ మహారాజ రవితేజ తోనే ‘మిరిపకాయ’ మూవీ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసి, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు హరీష్ శంకర్. దీంతో మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు. ‘గబ్బర్ సింగ్’ చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘దువ్వాడ జగన్నాథం’ తెరకెక్కించాడు. ఈ సినిమా యావరేజ్ గా నడిచింది. దీని తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేశ్’ సినిమా తెరకెక్కించాడు హరీష్ శంకర్. ఈ మూవీతో వరుణ్ తేజ్‌కు సూపర్ హిట్ ఇచ్చాడు. ఇక త్వరలో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భవదీయుడు భగత్‌సింగ్’ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు హరీష్ శంకర్. ఇప్పటికే టైటిల్ పోస్టర్స్‌తో పాటు, పవన్ లుక్ సినిమాపై బాగానే బజ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటివరకు 60 చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభంకానుంది.

పవన్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో హరీష్ శంకర్ ఒక ప్రాజెక్టు చేయనున్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మలయాళంలో వచ్చిన ‘బ్రో డాడీ’ మూవీని రీమేక్ చేయనున్నట్లు సమాచారం. మోహన్ లాల్ .. పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ బాధ్యతలను దర్శకుడు హరీష్ శంకర్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కి సంబంధించిన మార్పులు, చేర్పులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. ఏది ఏమైనా కూడా ఓ వైపు తమ్ముడిని, మరోవైపు అన్నయ్యని డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో… హరీష్ శంకర్ ని అందరూ లక్కీ ఫెల్లో అంటున్నారు.

Exit mobile version