Allu Arjun Arrest : అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగిన చిరంజీవి

Chiranjeevi - Allu Arjun : ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీ గా ఉండగా..అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ రద్దు చేసుకొని ఇంటికి బయలుదేరారు.

Published By: HashtagU Telugu Desk
Chiru Alluarjun

Chiru Alluarjun

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్‌(Allu Arrest)ను కలుసుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు (Chikkadapally Police Station) బయలుదేరారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీ గా ఉండగా..అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ రద్దు చేసుకొని ఇంటికి బయలుదేరారు. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. కానీ అల్లు అర్జున్ ను ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను గాంధీ హాస్పటల్ కు తరలించారు. అరెస్టైన అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేసినట్లు తెలిసింది. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆయనను రిమాండ్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేయనున్నారు.

చిరంజీవి స్టేషన్‌కు వెళ్లడం, అర్జున్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై చిరంజీవి ఏవిధంగా స్పందిస్తారన్నది అందరిలో ఆసక్తిని రేకేత్తిస్తోంది. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అభిమానులు చిరంజీవి జోక్యంపై ఆతృతగా ఉన్నారు. ఇకపోతే, ఈ కేసు చుట్టూ వివాదాలు మరింత తీవ్రమవుతున్నాయి. అర్జున్ అరెస్టు అంశంపై రాజకీయ, సినీ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, చిరంజీవి తదుపరి చర్యలు పరిస్థితిని ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

మరోపక్క అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీతపై ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం పాలకుల అశ్రద్ధకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను.. కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్‌ను సాధారణ నేరగాడిలా ట్రీట్‌ చేయడం సరికాదని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అరెస్ట్ ప్రక్రియపై ఆయన ఇలా సూటిగా స్పందించడంతో ప్రభుత్వం వైఖరిపై చర్చ మొదలైంది. సినీ పరిశ్రమలోనూ ఆయన వ్యాఖ్యలకు మద్దతు వ్యక్తమవుతోంది. ఇకపోతే, కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. “న్యాయానికి పోరాడే వ్యక్తులు ఉండడం సంతోషకరం” అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

  Last Updated: 13 Dec 2024, 02:21 PM IST