Operation Valentine : ఆపరేషన్ వాలెంటైన్ అందరు చూడాల్సిన చిత్రం – చిరంజీవి

  • Written By:
  • Publish Date - February 25, 2024 / 11:54 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి తర్వాత నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine). మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక (Operation Valentine Pre Release ) ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న త‌ర్వాత చిరంజీవి హాజరైన ఫ‌స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త‌న ఫ్యామిలీ హీరో మూవీ వేడుక‌కు చిరంజీవి గెస్ట్‌గా రావ‌డం మెగా అభిమానుల్లో సంతోషం నింపింది.

ఈ ఈవెంట్ లో చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ..పుల్వామాలో జవాన్లపై దాడికి ప్రతీకారంగా మన దేశం చేసిన ఎటాక్ నేపథ్యంలో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను యూత్ అంత తప్పక చూడాలని చిరంజీవి కోరారు. ‘ఇలాంటి సినిమాలు ఆడాలి. మన కోసం చలిలోనూ, ఎడారిలోనూ నిద్ర లేకుండా జవాన్లు మనల్ని ఎలా రక్షిస్తారో అందరూ తెలుసుకోవాలి. ఈ సినిమా వినోదం కోసం కాదు. ఓ ఎక్స్పీరియన్స్. 75 రోజుల్లో చాలా తక్కువ బడ్జెట్తో ఈ సినిమా తీయడం అద్భుతం’ అని చిరంజీవి కొనియాడారు.

‘నేను నాలుగైదు రోజుల క్రితం అమెరికాలో ఉండగా “డాడీ మీతో మాట్లాడాలి” అంటూ వరుణ్ తేజ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తర్వాత కాల్ చేసి మా సినిమా ఫంక్షన్ జరుగుతుంది.. మీరు ముఖ్య అతిథిగా రావాలని అడిగాడు.. భారత వాయుసేన మీద తీసిన ఇలాంటి సినిమాకి మీరు వస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది.. చిత్రాన్ని మరింత ఎక్కువ మంది చూస్తారని వరుణ్ చెప్పగానే ఇది నాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావించాను. ఒక సైనికుడి గురించి పది మందికి తెలిసేలా చేయడానికి వరుణ్ రమ్మన్నాడు. ఇలాంటి రియల్ హీరోల మీద తీసే సినిమాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది.. అందుకే ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఈ ఫంక్షన్‌కి రావడం నాకు గర్వంగా ఉంది. డైరెక్టర్ శక్తి ప్రతాప్ గురించి వరుణ్ చెప్పగా విన్నాను. అతను కేవలం ఒక కమర్షియల్ డైరెక్టర్‌గా అవుదామని రాలేదు. ఆయన దేశానికి సేవ చేసే వారి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అలా ఎంతో రీసెర్చ్ చేసి జరిగిన ఘటనను యథాతథంగా తీయగలిగాడు ఆయన. ఇలాంటి సినిమాలు ఆడాలి.. అలాగే ఇలాంటి కథలు వచ్చినప్పుడు మనం చూడాలి’ అని చిరంజీవి అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మా కుటుంబంలో ఏ హీరోకి రాని అవకాశాలు, డిఫరెంట్ రోల్స్ వరుణ్ తేజ్‌కి వచ్చాయి. ప్రతిదీ తను చాలా ప్లాన్‌డ్‌గా చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. తను చేసిన 13 సినిమాలు చాలా డిఫరెంట్ మూవీస్. అందులో నేపథ్యంగా తెలుగులో ఫస్ట్ టైమ్.. ఒక ఎయిర్ స్ట్రైక్ మీద తీసిన మొట్ట మొదటి సినిమా ఇది కావడం గర్వంగా ఉంది. ఏడాది క్రితం ‘టాప్ గన్’ అనే హాలివుడ్ మూవీ చూసి ఇలాంటివి మనం తీయగలమా అని అనిపించింది. కానీ ఈ మూవీలో సీన్స్ చూశాకా అలాంటి సినిమాను మన తెలుగోళ్లు ఈజీగా చేసి అవతల పడేశారంటే.. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అనిపించింది అని చిరు తెలిపారు.

ఇక నాగబాబు (Nagababu) మాట్లాడుతూ..’నాకు వరుణ్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అతడు ఎంపిక చేసుకునే పాత్రలు. రిస్క్ తీసుకుని కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆ రిస్క్ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. కొన్నిసార్లు మంచి ప్రయత్నాలూ ఫెయిల్ అవుతాయి. కానీ ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లేవాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు’ అని ఎమోషనల్ అయ్యారు. ఇక మూవీలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అక్ష‌య్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్‌తో యాక్టింగ్ కెరీర్ మొద‌లుపెట్టిన మానుషి చిల్లార్ ఆప‌రేష‌న్ వాలెంటైన్‌తో తెలుగులో తొలి అడుగు వేస్తోంది. ఈ మూవీలో రుహాణిశ‌ర్మ‌, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి సందీప్ ముద్దా ఈ మూవీని నిర్మిస్తోన్నాడు.

Read Also : BRS MLA: ఇందిరమ్మ రాజ్యం లో ప్రతిపక్షాల పైన దాడులు : కడియం శ్రీహరి