ANR జాతీయ అవార్డు ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. మెగా స్టార్ చిరంజీవి , బిగ్ బి , రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత , రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది హాజరై సందడి చేసారు.
ఈ ఏడాది ANR జాతీయ అవార్డు ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి అవార్డును అందుకున్నారు. తాను ఈ అవార్డు అందుకుంటున్న వేళ తన తల్లి ఈ వేడుకకు ఎందుకు హాజరైంది అనే విషయాన్ని చిరు (Chiranjeevi) తెలిపారు. తన తల్లి అంజనమ్మ (CHiranjeevi Mother ANjanamma) గారి అక్కినేని నాగేశ్వరరావు (ANR)పై ఉన్న విశేషమైన అభిమానం గురించి చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల వయస్సులో తన తల్లి అంజనమ్మ గారు నిండు గర్భిణిగా ఉండగా అక్కినేని గారి సినిమా విడుదల అవుతుండడంతో ఆ సినిమా చూడాలని పట్టుబట్టారు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండడంతో, రోడ్డు ప్రయాణం కూడా కష్టమైనప్పటికీ ఆమె కోరికను తీర్చడానికి చిరంజీవి తండ్రి జట్కా బండి రీడీ చేశారు. ప్రయాణంలో బస్సు అడ్డం రావడంతో జట్కా బండి బోల్తా కొట్టినా, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చూసినప్పటికీ, ఆమె అక్కినేని సినిమా చూడటానికి పట్టుదల వదలలేదు. చివరికి, ఆ సినిమా చూడగానే తృప్తి పడి ఇంటికి తిరిగి వచ్చారు. రెండు నెలల తర్వాత చిరంజీవికి జన్మనిచ్చారు. అప్పటి నుండి ఆమెకు అక్కినేని గారిపై ఉన్న అభిమానం, చిరంజీవికి వారసత్వంగా వచ్చిందని చిరు చెప్పుకొచ్చారు. చిరంజీవి తన తల్లికి ANR పై ఉన్న అభిమానాన్ని, మరియు తనకూ వారసత్వంగా వచ్చిన అభిమానాన్ని చెప్పడం, అభిమానులను కూడా ప్రభావితం చేసింది.
Read Also : No Non Veg : వచ్చేది కార్తీకమాసం.. నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే శరీరం ఏమవుతుందో తెలుసా?