Site icon HashtagU Telugu

Chiranjeevi: ఉమెన్స్ డే సందర్భంగా శ్రీ లీలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Chiranjeevi

Chiranjeevi

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందతున్న విశ్వంభర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడింది. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం విశ్వంభర మూవీ అన్నపూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌ లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ క్రమంలో అదే స్టూడియోలో మ‌రో షూటింగ్‌ లో ఉన్న శ్రీలీల‌ నటిస్తున్న మూవీ కూడా చిత్రీకరణ జరుగుతోంది. దీంతో తాను ఎంతగానో అభిమానించే హీరో, టాలీవుడ్ చిరంజీవి కూడా అదే సెట్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ, వెంటనే విశ్వంభర సెట్‌ కు వెళ్లి చిరంజీవిగారిని కలిసిందట. దీంతో చిరు శ్రీలీలతో కాసేపు మాట్లాడి, మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన ఈ ముద్దుగుమ్మకు శాలువా క‌ప్పి స‌త్కరించి దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బ‌హుమ‌తిగా బ‌హుక‌రించారు.

మెగాస్టార్ నుంచి వ‌చ్చిన ఈ ప్రత్యేక‌మైన బ‌హుమ‌తిని అందుకున్న శ్రీలీల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ లో షేర్ చేశారు. తాను చిరుతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. విత్ ఓజీ.. వెండితెరపై మనం ఎంతో ఆదరించే శంకర్ దాదా ఎంబీబీఎస్, మెగాస్టార్ చిరంజీవిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఉమెన్స్ డే సందర్భంగా ఆయన ప్రత్యేక బహుమతినిచ్చారు. రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా, స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.