Site icon HashtagU Telugu

Chiranjeevi : చిన్నప్పుడు క్రికెట్‌లో జరిగిన గాయం గురించి.. హీరో కార్తికేయతో షేర్ చేసుకున్న చిరు..

Chiranjeevi Karthikeya

Chiranjeevi Karthikeya

Chiranjeevi : మెగాస్టార్ చిరజీవి తన వీరాభిమాని కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ టీజర్ ని నేడు రిలీజ్ చేశారు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ చిత్రంలో క్రికెట్ కూడా ఒక నేపథ్యం కాబోతుందట. ఇక ఈ టీజర్ రిలీజ్ అనంతరం కార్తికేయ, చిరంజీవిని క్రికెట్ గురించి ప్రశ్నించారు. ‘చిన్నప్పుడు ఎప్పుడైనా సరదాగా క్రికెట్ ఆడేవారే..?’ అంటూ చిరుకి కార్తికేయ ప్రశ్న వేశారు.

దీనికి చిరంజీవి బదులిస్తూ.. “గతంలో నేను కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ నా టీం ప్లేయర్ గా ఆడిన మ్యాచ్ చూసి, నేను ఏదో పెద్ద క్రికెట్ ప్లేయర్ అని మాత్రం అనుకోకండి. నాకు క్రికెట్ అస్సలు రాదు. దాని పై ఆసక్తి కూడా అంతంత మాత్రానే. అయితే చిన్నప్పుడు ఎనిమిది తొమ్మిది తరగతి చదువుతున్న సమయంలో క్రికెట్ ఆడుతుంటే.. ఒక కుర్రాడు నా చేతి పై బ్యాట్ తో కొట్టాడు. ఆ గాయం మచ్చ ఇప్పటికి ఉంది. అప్పటి నుంచి మళ్ళీ నేను బ్యాట్ పట్టుకోలేదు” అంటూ చిరంజీవి తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటనని కార్తికేయతో పంచుకున్నారు.

ఇక కార్తికేయ గురించి మాట్లాడుతూ.. “కార్తికేయ అంటే నాకు ప్రత్యేకం. అందుకు నాకు చాలా కారణాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో అభిమానిస్తున్న కార్తికేయ నేడు హీరో అయ్యి సినిమాలు చేస్తున్నాడంటే.. అవి హిట్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను” అంటూ కార్తికేయ పై తన ప్రేమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘భజే వాయు వేగం’ సినిమాని కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ ని తీసుకు వచ్చిన మేకర్స్ త్వరలోనే ట్రైలర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.

Also read : Harish Shankar : ప్రెస్ నోట్‌తో చిరంజీవి మూవీ కెమెరామెన్‌కి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హరీష్ శంకర్..