Site icon HashtagU Telugu

Chiranjeevi with Salman Khan: సల్లూ.. లెట్స్ డు కుమ్ముడు!

Chiru

Chiru

ఆచార్య మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ మూవీపై ప్రత్యేకంగా ద్రుష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ఊటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం కంప్లీటైంది. ఈ సినిమా ‘గాడ్ ఫాదర్’ ప్రకటించగానే అభిమానుల్లో వైబ్రేషన్స్ మొదలైంది.

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరగబోతుండగా దానికి సంబంధించిన ఫోటోని మెగాస్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తో సాంగ్ షూటింగ్ జరగబోతుందని, ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఈ సాంగ్ షూటింగ్ మొదలు కాబోతుంది అంటూ చిరంజీవి ప్రకటించారు. అభిమానులకే కనుల పండుగే అంటూ చిరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరు, సల్మాన్ ఫొటో వైరల్ గా మారింది.

 

 

Exit mobile version