Chiranjeevi : ఈసారి అన్నయ్య వంతు.. వైసీపీ నేతలు దాడికి సిద్ధం

మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ,

  • Written By:
  • Updated On - August 8, 2023 / 03:25 PM IST

నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలనే టార్గెట్ చేస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలను టార్గెట్ చేయబోతుందా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ లవర్స్ ఇలాగే మాట్లాడుకుంటున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్.. ఏపీ సర్కార్ (AP Government ) వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది. టికెట్స్ ధరల విషయం దగ్గరినుండి అదనపు షోస్ వరకు అన్ని విషయాల్లో సర్కార్ ..చిత్రసీమ (Tollywood Industry)ను ఇబ్బందికి గురి చేస్తూ వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుండి కొత్త సినిమా వస్తుందంటే చాలు..జగన్ ప్రభుత్వానికి ఎక్కడలేని చట్టాలు గుర్తుకొస్తున్నాయి. అంతే కాదు ప్రభుత్వ ఆఫీస్ లలో పనిచేయాల్సిన ఉద్యోగులు సైతం థియేటర్స్ దగ్గర పనిచేసే స్థాయికి తీసుకొస్తున్నాడు. వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ , మొన్నటి బ్రో వరకు ఇలాగే కొనసాగింది. బ్రో (BRO) విషయంలో అయితే ఏకంగా మంత్రే (Minister Ambati Rambabu) రివ్యూ ఇవ్వడం..కలెక్షన్లు చెప్పడం స్థాయికి దిగజారారు. దీనిని బట్టి తెలుస్తుంది చిత్రసీమ అంటే జగన్ సర్కార్ కు ఎంత లోకువో.

చిత్రసీమ విషయంలో జగన్ ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న..టాలీవుడ్ పెద్దలు ఏమాత్రం స్పందించకుండ ఉండడం చాలామందికి నచ్చడం లేదు. ఆ మధ్య అయితే టికెట్ ధరలను టీ ధర కంటే తక్కువ చేసింది వైసీపీ సర్కార్. ఆ తర్వాత చిరంజీవి , మహేష్ , ప్రభాస్ ఇలా పలువురు అగ్ర నటులు , నిర్మాతలు , దర్శకులు జగన్ వద్దకు వెళ్లి చేతులు పట్టుకొని ప్రాధేయపడితే..మళ్లీ టికెట్ ధరలు (Movie Ticket Price) పెంచారు. ఇంతచేస్తున్నప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు వైసీపీ సర్కార్ తీరు ఫై స్పందించలేదు.

కానీ ఈరోజు ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు (Waltair Veerayya 200 Days) పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవీ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో కేవలం చిత్ర యూనిట్ మాత్రమే పాల్గొంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. సినిమాలపై పడకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఏపీ సర్కార్ కు సూచించారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

ఈవ్యాఖ్యలు అక్కడి వారినే కాదు అందర్నీ షాక్ కు గురి చేసాయి. మరో రెండు రోజుల్లో భోళా శంకర్ (Bholaa Shankar) సినిమా రిలీజ్ అవుతుంది. ఈ టైం లో చిరంజీవి ఆలా అన్నారేంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. కానీ చాలామంది మాత్రం ఇప్పటికైనా చిరంజీవి స్పందించారని..లేకపోతే ప్రతిసారి జగన్ చిత్రసీమ ను తక్కువగా చూడడం..పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకోవడం చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

మరోపక్క చిరంజీవి కామెంట్స్ ఫై వైసీపీ నేతల దాడి మొదలైంది. మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) చిరు కామెంట్స్ ఫై ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడి గాళ్లకి కూడా చెబితే బాగుంటుందన్నారు. అంతే కాదు నాని బాటలోనే మిగతా నేతలు ప్రెస్ మీట్ లకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈసారి అన్నయ్య ను టార్గెట్ చేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ ఎఫెక్ట్ భోళా శంకర్ ఫై ఎంత పడుతుందో చూడాలి.

Read Also : Pawan Game change : చంద్ర‌బాబు పాల‌న‌పై ప‌వ‌న్ వ్య‌తిరేక‌గ‌ళం, పొత్తు లేన‌ట్టే!