Chiranjeevi : క్లీంకార పిలవడం కోసం చిరు పెట్టుకున్న పేరేంటో తెలుసా..? లాజిక్‌తో ఉంటుంది..

క్లీంకార తనని పిలవడం కోసం చిరంజీవి ఓ పేరు పెట్టుకున్నారు. అయితే ఆ పేరులో కూడా ఓ లాజిక్‌ ఉంది.

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 05:56 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ తండ్రి అవుతూ, తనని ఎప్పుడు తాతయ్యని చేస్తాడో అని దాదాపు పదేళ్లు ఎదురు చూసారు. పెళ్ళైన పదేళ్ల తరువాత రామ్ చరణ్, ఉపాసన.. తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలియజేసి అందరికి గుడ్ న్యూస్ చెప్పారు. గత ఏడాది జూన్ 20న ‘క్లీంకార’ కి జన్మనిచ్చి.. మెగా ఇంటికి మహాలక్ష్మిని తీసుకు వచ్చారు ఉపాసన. ఇక క్లీంకార రాకతో మెగా కాంపౌండ్ లో సంతోషాల సంబరాలు మొదలయ్యాయి. చిరంజీవి కూడా మనవరాలి రాకతో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారు.

ఇక ఈ తాత మనవరాలి మధ్య ఉన్న బంధం గురించి రామ్ చరణ్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. క్లీంకార రాకతో తన మొదటి ఫాదర్స్ డేని జరుపుకుంటున్న రామ్ చరణ.. ఓ నేషనల్ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో క్లీంకార గురించి అనేక విషయాలను పంచుకున్న రామ్ చరణ్, చిరు-క్లీంకార బంధం గురించి మాట్లాడుతూ.. ‘క్లీంకారతో ఉన్నప్పుడు చిరంజీవి కూడా ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడట. క్లీంకార తనని కొడుతుంటే చిరంజీవి బాగా ఎంజాయ్ చేస్తుంటారట’.

కాగా క్లీంకార తనని తాత అని పిలవడం చిరంజీవికి ఇష్టం లేదంట. దీంతో తనని పిలవడం కోసం చిరంజీవి ఓ పేరుని పెట్టుకున్నారట. ఆ పేరుని కూడా చరణ్ తెలియజేసారు. తనని తాత అని పిలవద్దని, అది చాలా బోరింగా ఉందని, తనని ‘చిరుత’ అని పిలవమని చిరంజీవి చెబుతుంటారట. అయితే ఈ చిరుత పేరులో కూడా ఒక చిన్న లాజిక్ ఉంది. చిరంజీవిలో ‘చిరు’, తాతయ్యలో ‘త’ని కలుపుతూ.. చిరు+త=చిరుత అని పెట్టుకున్నారట. ఈ లాజిక్ తెలుసుకున్న అభిమానులు.. అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.