Site icon HashtagU Telugu

Getup Srinu : టెలివిజన్ కమల్ హాసన్ కాదు.. ఆంధ్రా దిలీప్ కుమార్.. గెటప్ శ్రీనుకి చిరు బిరుదు..

Chiranjeevi Said Getup Srinu Is Like Senior Actor Chalam And Dilip Kumar

Chiranjeevi Said Getup Srinu Is Like Senior Actor Chalam And Dilip Kumar

Getup Srinu : తెలుగు టీవీ షో ‘జబర్దస్త్’తో ఎంతోమంది కమెడియన్స్ సినిమా పరిశ్రమలో, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. వారిలో ఒకడు గెటప్ శ్రీను. ఈ నటుడు గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ లో ఎన్నో గెటప్స్ వేసి.. టెలివిజన్ కమల్ హాసన్ అనే బిరుదుని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరో బిరుదుని అందుకున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచి ఆ బిరుదుని పొందారు.

గెటప్ శ్రీను హీరోగా నటిస్తూ ‘రాజు యాదవ్’ అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. మే 24న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ జోష్ లో గెటప్ శ్రీను జరుపుతున్నారు. ఇక గెటప్ శ్రీనుని ఎంతో ఇష్టపడే మెగాస్టార్ చిరంజీవి.. ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈ మూవీని చూడాలంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసారు.

ఇక ఈ వీడియోలో చిరంజీవి గెటప్ శ్రీను గురించి మాట్లాడుతూ.. “గెటప్ శ్రీనుని చూస్తుంటే నాకు ఒకప్పటి కామెడీ హీరో గుర్తుకు వస్తారు. ఆయన పేరు ‘చలం’. అప్పటిలో ఆయన్ని ఆంధ్రా దిలీప్ కుమార్ అని పిలిచేవారు. ఇప్పుడు గెటప్ శ్రీను నటన చూస్తుంటే నాకు వారే గుర్తుకు వస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక మొన్నటి వరకు టెలివిజన్ కమల్ హాసన్ అనిపించుకున్న గెటప్ శ్రీను.. నేడు చిరంజీవి పలికిన ఈ మాటలతో ‘ఆంధ్రా దిలీప్ కుమార్’, ‘జూనియర్ చలం’ అని కూడా పిలిపించుకుంటారు. మరి వచ్చే వారం రాజు యావద్ గా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.