Site icon HashtagU Telugu

Chiranjeevi : చిరంజీవి పోస్టర్ రిఫరెన్స్ తో హనుమాన్.. భలే చిత్రంగా ఉందే..!

Chiranjeevi Reffernce For Prashanth Varma Hanuman

Chiranjeevi Reffernce For Prashanth Varma Hanuman

Chiranjeevi ఈ ఇయర్ మొదట్లో స్టార్ సినిమాలకు పోటీగా వచ్చి సెన్సేషనల్ విన్ విజయం అందుకున్న సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తేజా సజ్జ, అమృత అయ్యర్, సముద్రఖని నటించారు. సంక్రాంతి బరిలో రిలీజై 300 కోట్ల దాకా వసూళ్లను రాబట్టిన హనుమాన్ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది.

ఈ సినిమాలో పెద్ద హనుమాన్ విగ్రహం సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రివీల్ చేశారు. హనుమాన్ సినిమాలో భారీగా ఉన్న హనుమాన్ విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి పోస్టర్ రిఫరెన్స్ తో సిద్ధం చేశారట. రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఆ విషయాన్ని చెప్పారు. హనుమాన్ చిత్రంలో విగ్రహం చిరంజీవి గారి స్టాలిన్ సినిమాలోని పోస్టర్ ని చూసి తయారు చేశామని అన్నారు.

స్టాలిన్ సినిమాలో చిరంజీవి చేతులు కట్టుకుని ఒక పవర్ ఫుల్ లుక్ ఉంటుంది. అది చూసిన ప్రతిసారి ప్రశాంత్ వర్మకు గూస్ బంప్స్ అనిపిస్తుందట. అందుకే ఆ రిఫరెన్స్ తో హనుమాన్ విగ్రహాన్ని సిద్ధం చేశారట. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తుంది. ఈ సినిమాను ఆడియన్స్ అంచనాలకు మించి ఉండేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

జై హనుమాన్ సినిమా మీద నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ ఉంది. ఆ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ నటిస్తారని టాక్. 2025 లోనే సినిమా రిలీజ్ చేస్తానని ప్రశాంత్ వర్మ మళ్లీ మళ్లీ చెబుతున్నాడు.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బర్త్ డేకి.. రెడీ అవుతున్న బహుమతులు..