Site icon HashtagU Telugu

Padma Vibhushan : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న‌ మెగాస్టార్ చిరంజీవి

Chiru Padma

Chiru Padma

రాష్ట్రపతి (President Murmu) చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) పద్మవిభూషణ్ (Padma Vibhushan) అవార్డు ను అందుకున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలలో చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. కాగా, నేడు (గురువారం) సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుక‌లో చిరంజీవి భార్య సురేఖ‌తో పాటు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, కోడ‌లు ఉపాసన ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ (చిరంజీవి)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి. ఆ ఆసక్తే ఆయన్ను మద్రాస్ ఫిల్మ్ ఇన్​స్టిట్యూట్​లో చేరేలా చేసింది. ‘పునాదిరాళ్లు’ సినిమాలో ఫస్ట్ ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత వెనక్కితిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ ఈరోజు కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. ముఖ్యంగా చిరంజీవి ని అంత ఇష్టపడడానికి కారణం డాన్స్. 90ల్లో డ్యాన్స్​ అంటే చిరంజీవిదే. చిరంజీవి అంటే డాన్స్ అనే రేంజ్ లో ఆయన అదరగొట్టారు. యాక్షన్​ సీన్స్​తో మాస్ ప్రేక్షకుల్ని కూడా తనవైపు తిప్పుకున్నారు. ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్​ ఇలా అన్నింట్లో తనదైన మార్క్ చూపించి మెగాస్టార్ అయ్యాడు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్‌ లీడర్‌’ వంటి సినిమాల కలెక్షన్లు సరికొత్త రికార్డ్స్ నెలకొల్పాయి. అప్పట్లోనే కోట్ల రూపాయిలు రాబట్టాయంటే అర్ధం చేసుకోవాలి..ఏ రేంజ్ లో ఆ సినిమాలు నడిచాయో..

2009 లో రాజకీయాల్లో వెళ్లిన చిరంజీవి ..దాదాపు 10ఏళ్ల తర్వాత మళ్లీ ‘ఖైదీ నెం.150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో తొలి సినిమాతోనే పలు రికార్డులు బద్దలుకొట్టి, ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’తో సెకండ్ హాఫ్​లోనూ జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చేస్తున్నారు.

Read Also : YS Jagan : బీఆర్‌ఎస్ చేసిన తప్పును జగన్ పునరావృతం చేయకూడదనుకుంటున్నారా..?