Chiranjeevi : ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం అండ్ కో చేసే కామెడీ సీన్స్ నచ్చిన చిరంజీవి ఏం చేశాడో తెలుసా..?

బ్రహ్మానందం(Brahmanandam) అండ్ కో చేసే కామెడీ. "మీది తెనాలి మాది తెనాలి" అంటూ బ్రహ్మి టీం చేసే కామెడీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi Reaction For Brahmanandam Comedy Scene in Indra Movie

Chiranjeevi Reaction For Brahmanandam Comedy Scene in Indra Movie

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఫ్యాక్షన్ డ్రామా మూవీ ‘ఇంద్ర'(Indra). సి.అశ్వినిదత్ నిర్మాణంలో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టించింది. చిన్నికృష్ణ కథని అందించగా పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ చిరు పక్కన ఆడిపాడి అలరించారు. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక ప్రేక్షకులను బాగా నవ్వించే సన్నివేశాలు అంటే.. బ్రహ్మానందం(Brahmanandam) అండ్ కో చేసే కామెడీ. “మీది తెనాలి మాది తెనాలి” అంటూ బ్రహ్మి టీం చేసే కామెడీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.

కాశీలో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కలిసి ఆమంచి వెంకట్ సుబ్రహ్మణ్యం (AVS) ని మోసం చేసే సీన్స్ ప్రతి ఒక్కర్ని కడుపుబ్బా నవ్వించాయి. చిరంజీవికి అయితే ఈ సన్నివేశాలు గురించి చెబుతున్న సమయంలోనే బాగా నచ్చేశాయట. దీంతో ఆ సీన్స్ లో తాను లేకపోయినా.. ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో సెట్స్ కి వచ్చేవారట. సెట్స్ లో ఆ కామెడీ చూసి కడుపుబ్బా నవ్వుకునేవారట. అయితే ఆ ఆనందాన్ని తాను మాత్రమే అనుభవించకుండా.. తన శ్రేయోభిలాషులు అయిన కె విశ్వనాథ్, కె రాఘవేంద్రరావుకి కూడా పంచాలని అనుకున్నారు.

అందుకనే నెక్స్ట్ రోజు సెట్స్ కి ఆ ఇద్దరు దిగ్గజ దర్శకులను కూడా తీసుకు వచ్చారట. ఇక ఏముంది, మొదటి ఆడియన్స్ గా ఈ ముగ్గురే అయ్యి ఆ కామెడీ సీన్స్ ని ఆస్వాదించి పడిపడి నవ్వుకున్నారట. వీరితో పాటు సినిమా దర్శకుడు బి గోపాల కూడా కట్ చెప్పడం మర్చిపోయి నవ్వుకున్నారట. ఇక ఆ సీన్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా పేలిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఈ కామెడీ ట్రాక్ రిఫరెన్స్ తోనే.. అల్లు అర్జున్ ‘గంగోత్రి’, ‘బద్రీనాథ్’ చిత్రాల్లో కూడా సీన్స్ చేశారు.

Also Read : Naveen Polishetty : డిప్రెషన్ లో నవీన్ పొలిశెట్టి.. తన MBBS ఫ్రెండ్ ని ఏమని అడిగాడంటే..!

  Last Updated: 22 Nov 2023, 06:37 AM IST