Mega Treat for Mega Fans పండుగ వస్తుంది అంటే స్టార్ హీరోల సినిమాల టీజర్, ట్రైలర్స్ తో హంగామా ఉంటుంది. ఐతే ఈ దసరాకి మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. చరణ్ గేమ్ చేంజర్ నుంచి ఒక టీజర్ రాబోతుందని తెలుస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా నుంచి కూడా ఒక గ్లింప్స్ వస్తుందని తెలుస్తుంది. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
ఇక చరణ్ గేమ్ చేంజర్ మాత్రం భారీ ప్లానింగ్ తో వస్తున్నాడు. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన రెండు సాంగ్స్ ఇంప్రెస్ చేశాయి. మెగా ఫ్యాన్స్ అందరికీ మెగా ట్రీట్ ఇచ్చేలా గేమ్ చేంజర్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
జనవరి 10 రిలీజ్ కన్ఫర్మ్..
ఐతే చిరు (Chiranjeevi) విశ్వంభర (Viswambhara) జనవరి 10 రిలీజ్ దాదాపు కన్ఫర్మ్ అన్నట్టే. రిలీజ్ డేట్ విషయంలో వారు వెనక్కి తగ్గట్లేదు. చరణ్ (Ram Charan) గేమ్ చేంజర్ సినిమా మాత్రం డిసెంబర్ 20కి వస్తుందని అంటున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో రిలీజ్ క్లారిటీ రావాల్సి ఉంది. గేమ్ చేంజర్ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.
గేమ్ చేంజర్ చేంజర్ సినిమా అన్ని లెక్కలతో వస్తుంది. సినిమా ఒకవేళ ఆశించిన స్థాయిలో ఉంటే శంకర్ స్టామినా పాన్ ఇండియా లెవెల్ లో తెలిసేలా చేస్తుంది.
Also Read : Aravind Swamy : అరవింద్ స్వామి కెరీర్ గ్యాప్ రీజన్స్ అవేనా..?