Rajendra Prasad : రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన చిరంజీవి

Rajendra Prasad : గుండె పోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

Published By: HashtagU Telugu Desk
Chiru Rajendra

Chiru Rajendra

టాలీవుడ్​ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె గాయత్రి (38) (Rajendra Prasad Daughter Gayathri) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలిసి రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.

తాజాగా నటులు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , అల్లు అర్జున్ (Allu Arjun) , వెంక‌టేశ్‌ (Venkatesh), దర్శకుడు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి తో పాటు పలువురు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించి..వివరాలు అడిగి తెలుసుకున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా రాజేంద్ర‌ప్రసాద్‌ని క‌లిసి ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదిక‌గా స్పందిస్తూ.. నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ రాసుకోచ్చాడు.

నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన రాజేంద్ర ప్రసాద్​, మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కామెడీ హీరోగా మెప్పించారు. ఎన్నో సూపర్​ హిట్​ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా రాణిస్తున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. గతంలో బేవార్స్ అనే సినిమా ఈవెంట్‌లో తన కుమార్తె గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అమ్మ లేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన పదేళ్ల వయసులోనే తన తల్లి చనిపోయారని, అందుకే తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని చెప్పుకొచ్చారు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ‘తల్లి తల్లి నా చిట్టి తల్లి’ అనే పాట తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆ సాంగ్​ను గాయత్రికి ఎన్నో సార్లు వినిపించినట్లు తెలిపారు. అప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

Read Also : Canada : వెయిటర్ జాబ్ కోసం భారతీయ విద్యార్థులు అంత కష్టపడాలా..?

  Last Updated: 05 Oct 2024, 05:16 PM IST