Chiranjeevi : చిరంజీవి కోసం తమ్ముడు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేస్తున్న దర్శకుడు..

చిరంజీవి కోసం తన తమ్ముడి కెరీర్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన మూవీని పక్కన పెట్టేస్తున్న దర్శకుడు. ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు..?

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 12:30 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు ఆశపడుతుంటాడు. అయితే ఆ కలని కొంతమందే నిజం చేసుకుంటుంటారు. అలా తమ కలని నిజం చేసుకున్న దర్శకుల్లో ‘మోహన్ రాజా’ ఒకరు. చిరంజీవితో ‘గాడ్‌ఫాదర్’ వంటి సినిమా చేసి.. ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. చిరంజీవిని ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించి మోహన్ రాజా ఫ్యాన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసారు.

అభిమానుల నుంచి మాత్రమే కాదు, చిరంజీవి నుంచి కూడా మోహన్ రాజాకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో మోహన్ రాజాని మెచ్చి చిరంజీవి మరో అవకాశాన్ని గాడ్‌ఫాదర్ సమయంలోనే మాట రూపంలో ఇచ్చేసారు. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకోవడానికి తన తదుపరి సినిమాని మోహన్ రాజాతో ప్లాన్ చేస్తున్నారట చిరంజీవి. ఇక చిరంజీవి ఇస్తున్న అవకాశం కోసం మోహన్ తన తముడి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేస్తున్నారట.

తన తమ్ముడు జయం రవిని హీరోగా పెట్టి మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ‘తని ఒరువన్’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జయం రవిని ఓవర్ నైట్ లో స్టార్ట్ హీరోని చేసేసింది. ఈ సినిమానే రామ్ చరణ్ ‘ధృవ’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్టుని అందుకున్నారు. కాగా గత ఏడాది జయం రవితో మోహన్ రాజా ఈ మూవీకి సీక్వెల్ ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయలేదు.

ఇక తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. చిరంజీవి ‘విశ్వంభర’ పూర్తి చేసిన తరువాత మోహన్ రాజాతో సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లోనే మోహన్ రాజా ఉన్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ లో ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. ఆగష్టు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని.. చిరంజీవి కోసం మోహన్ రాజా తన తమ్ముడి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేస్తున్నారా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.