Site icon HashtagU Telugu

Chiranjeevi New Commercial Ad : మెగాస్టార్ ‘మెగా మాస్’ యాడ్ చూసారా..?

Chiranjeevi New Commercial

Chiranjeevi New Commercial

Chiranjeevi New Commercial Ad for Country Delight Milk : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏజ్ పెరుగుతున్నా.. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టే.. అటు కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు. ఎప్పుడో సాప్ట్ డ్రింక్ యాడ్ తో పాటు మరికొన్ని కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన చిరు..తాజాగా ‘కంట్రీ డిలైట్’ యాడ్‌లో నటించారు. ఈ యాడ్ కు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేయడం విశేషం.

తనలో ఫైర్ ఏ మాత్రం తగ్గలేదని ఈ యాడ్ తో మరోసారి ప్రూవ్

ఈ యాడ్ లో చిరంజీవి మరోసారి తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. అలాగే యాడ్ లో క్లాస్ అండ్ మాస్ లుక్ లో కనిపించి అభిమానులను అలరించారు. 70 యేళ్లకు దగ్గర పడుతున్న తనలో ఫైర్ ఏ మాత్రం తగ్గలేదని ఈ యాడ్ తో మరోసారి ప్రూవ్ చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా చాలా యేళ్ల తర్వాత చిరంజీవి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించడం చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

చాల ఏళ్ల తర్వాత చిరంజీవి నుండి వస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం

ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి సినిమాల తర్వాత చిరు యాక్ట్ చేస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఘరానా మొగుడు, ఆపద్భాంధవుడు, ఎస్పీ పరశురామ్ తర్వాత చిరంజీవి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read Also : Laddu Eating Contest In Ganesh Chaturthi: లడ్డూలు తినే పోటీ, ఎక్కడో తెలుసా ?