Site icon HashtagU Telugu

Soggadu Director : చిరు పొమ్మన్నాడు.. నాగ్ రమ్మంటాడా.. సోగ్గాడి పరిస్థితి ఇలా మారిపోయిందేంటి..?

ANR National Award for Megastar Chiranjeevi

ANR National Award for Megastar Chiranjeevi

Soggadu Director మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాగా అసలైతే సోగ్గాడే చిన్ని నాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో చేయాలని అనుకున్నాడు. మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ లో ఈ సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే సడెన్ గా ఏమైందో ఏమో కానీ ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ మూవీ ప్లేస్ లో వశిష్టతో విశ్వంభర ఓకే చేశాడు చిరు. కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

ఇప్పుడు ఆ డైరెక్టర్ మళ్లీ నాగార్జున గూటికి చేరుతాడా అన్నది తెలియాల్సి ఉంది. నాగార్జున తో ఆల్రెడీ సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు చేశాడు కళ్యాణ్ కృష్ణ. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే చిరు సినిమా క్యాన్సిల్ అవ్వడంతో కళ్యాణ్ కృష్ణ మరోసారి నాగార్జునతో సినిమా చేయాలని అనుకుంటున్నారు.

నాగార్జున కూడా కళ్యాణ్ కృష్ణ మీద సాఫ్ట్ కార్నరే చూపుతున్నాడని తెలుస్తుంది. అక్కినేని హీరోలకు 3 హిట్లు ఇచ్చినా సరే ఈ డైరెక్టర్ కి టైం కలిసి రావట్లేదని చెప్పొచ్చు. మరి కళ్యాణ్ కృష్ణ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తాడన్నది చూడాలి. టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ఇలా స్టార్స్ డేట్స్ ఇస్తేనే అన్నట్టు కాకుండా యంగ్ హీరోలతో అయినా సినిమా చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.

కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ విషయం సీరియస్ గా ఆలోచించాల్సిందే. ఎందుకంటే రెండు మూడేళ్లు కెరీర్ లో వెనకపడితే ఇక ఆ డైరెక్టర్ ని మర్చిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే సోగ్గాడు డైరెక్టర్ అంటే తప్ప గుర్తు పట్టలేని కళ్యాణ్ కృష్ణ ఆ ఐడెంటిటీ కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది.