Site icon HashtagU Telugu

Chiru-Nag : చిరంజీవి – నాగార్జున ఫ్రెండ్ షిప్ చూడండి..ఇది కదా స్నేహమంటే..!!

Chiru Nag

Chiru Nag

చిత్రసీమ (Film Industry )లో ఎంతోమంది హీరోలు (Heros) ఉన్నారు..ఎవరికీ వారే బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటే టాలెంట్ ఉంది. అంతే కాదు తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ద పడే అభిమానులు ఉన్నారు. ఎంతమంది హీరోలు ఉన్న..చిరంజీవి (Chiranjeevi) , నాగార్జున (Nagarjuna), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh) అంటే ఆ క్రేజ్ వేరు. ఈ నలుగురు తమ వయసు సైతం లెక్కచేయకుండా ఇప్పటికి సినిమాలు చేస్తూ..యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి అయితే ఏడాది ఒకటి , రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక జీవితంలో మంచి స్నేహితుడు దొరకడం కంటే అదృష్టం మరోటి ఉండదు. మనమేం చేసినా కూడా ముందు వెనక అడుగులు వేస్తూ ఉంటారు స్నేహితులు. ఏ సంబంధం లేకుండా మనకోసం ముందడుగు వేస్తుంటారు. కష్టాల్లో తోడుంటారు.. అవసరం అయినపుడు ఆదుకుంటారు. అలాంటి స్నేహితుల కోసం అంతా వేచి చూస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి ప్రాణ స్నేహితులు కొందరున్నారు. వారిలో చిరంజీవి – నాగార్జున. ఈ ఇద్దరు మొదటి నుండి మంచి స్నేహితులు. సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కలుసుకోనప్పటికీ బయట మాత్రం నిత్యం కలుసుకుంటూ ..కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అంతే కాదు ఎవరికీ ఏ కష్టం వచ్చిన ముందు ఉండి నిలబడతారు.

రీసెంట్ గా నాగార్జున పై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను సైతం మెగాస్టార్ చిరంజీవి ఖండించడమే కాదు..ఇలాంటివి మరోసారి చేస్తే బాగొదంటూ మెగా హెచ్చరిక సైతం జారీ చేసారు. చిత్రసీమలో ఇలాంటి ఇబ్బందులు వచ్చిన ఇద్దరు ముందు ఉండి ఆ సమస్యలు తీరుస్తారు. అంతే ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోషన్ సైతం చేస్తుంటారు. అందుకే చిత్రసీమలోనే కాదు బయట కూడా వీరి స్నేహం చూసి అభిమానులు వావ్ అనుకుంటుంటారు. తాజాగా వీరిద్దరికి సంబదించిన ఓ వీడియో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఎక్కడోకో వెళ్తున్నట్లుంది. ముందుగా ఎయిర్ పోర్ట్ కు వచ్చిన చిరు..వెనుకాల వస్తున్న నాగ్ ను చూసి..లోపలికి వెళ్లకుండా నాగ్ వచ్చేవరకు వెయిట్ చేసి..ఆ తర్వాత ఇద్దరు కలిసి లోనికి వెళ్లారు. దీనికి సంబదించిన వీడియో వైరల్ గా మారడం తో ఇది కదా స్నేహమంటే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Aam Aadmi Party : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : ఆమ్ ఆద్మీ పార్టీ