Site icon HashtagU Telugu

Chiranjeevi : చిరంజీవి సినిమా.. సాంగ్స్ లేకుండా చూస్తారా..!

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర (VIswambhara) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరు ఊహించని కాంబో ఫిక్స్ చేసుకున్నాడు. దసరాతో డైరెక్టర్ గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలతో చిరు సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమా చిరంజీవి ఊర మాస్ ఏంటో చూపిస్తారని తెలుస్తుంది. సినిమా అనౌన్స్ మెంట్ తోనే బ్లడ్ బాత్ చూపించారు.

ఇక ఈ సినిమా విషయంలో మరో అప్డేట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. సినిమాలో సాంగ్స్ లేకుండా ప్రయోగం చేయబోతున్నారట. ఏంటి చిరు సినిమాలో సాంగ్స్ లేకుండానా కష్టమే కదా అనుకోవచ్చు. కానీ అది చేసి చూపిస్తా అంటున్నాడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). చిరు సినిమా తో సాహసం చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ సినిమాను నాని (Nani) నిర్మాణ భాగం అవ్వడం మరింత క్రేజీగా మారింది.

నాని నిర్మిస్తున్న సినిమాలకు కచ్చితంగా ఫ్యాన్స్ లో అంచనాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో చిరు సినిమాను ప్రొడ్యూస్ చేయడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. విశ్వంభర సినిమా పూర్తి కావడమే ఆలస్యం చిరు శ్రీకాంత్ సినిమా మీద ఫోకస్ చేయనున్నారు. మరోపక్క శ్రీకాంత్ రెండో సినిమా నానితో చేస్తున్నాడు. ఈ సినిమాకు పారడైస్ అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి దసరాని మించి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఏది ఏమైనా మెగా బాస్ తో శ్రీకాంత్ చేయబోతున్న ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.