Chiranjeevi : సందీప్ వంగతో చిరంజీవి మూవీ కన్ఫార్మ్ అయ్యిందా..!

సందీప్ వంగతో చిరంజీవి మూవీ కన్ఫార్మ్ అయ్యిందా. చిరంజీవికి పెద్ద వీరాభిమాని అని చెప్పుకునే సందీప్ వంగ..

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi, Sandeep Reddy Vanga, Vishwambhara

Chiranjeevi, Sandeep Reddy Vanga, Vishwambhara

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలు కంటే యమా ఫాస్ట్ గా పని చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే మరో రెండు సినిమాలను లైనప్ లో పెడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మరో రెండు మూడు సినిమాలు లైనప్ లో ఉన్నట్లు.. ఇటీవల రామ్ చరణ్ తెలియజేసారు. అయితే ఆ చిత్రాలు వివరాలు మాత్రం తెలియజేయలేదు. కాగా ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో చిరంజీవి న్యూ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ న్యూస్ హల్‌చల్ చేస్తుంది.

అదేంటంటే సందీప్ రెడ్డి వంగతో చిరంజీవి సినిమా కన్ఫార్మ్ అయ్యిందట. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో టాలీవుడ్ టు బాలీవుడ్ సెన్సేషన్ అయిన సందీప్ వంగ.. చిరంజీవికి పెద్ద వీరాభిమాని అని అందరికి తెలిసిందే. చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. అసలు వదులుకోనని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందట. ప్రస్తుతం తన అభిమానులు అయిన దర్శకులకు అవకాశాలు ఇస్తున్న చిరంజీవి.. సందీప్ వంగకి కూడా ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అన్నారట.

ఇక చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వంగ కూడా కథని సిద్ధం చేసేందుకు సిద్దమవుతున్నారట. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పడుతుందని సమాచారం. సందీప్ వంగ లైనప్ లో ప్రస్తుతం స్పిరిట్, యానిమల్ పార్క్ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు పూర్తి అయిన తరువాతే చిరంజీవి సినిమా మొదలుపెట్టే అవకాశం ఉందట. అంతేకాదు సందీప్ వంగ కూడా చిరంజీవి సినిమాకి కథని సిద్ధం చేసుకోవడానికి సమయం అవసరమని టాక్ వినిపిస్తుంది.

కాగా మెగా అభిమానులు ఈ కాంబో కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యిందనే వార్త మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

  Last Updated: 21 Jul 2024, 04:28 PM IST