Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్‌ఫాదర్’ సినిమా చేసి మెగా ఫ్యాన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు ‘మోహన్ రాజా’. ఆల్రెడీ ఆడియన్స్ కి తెలిసిన కథ అయినా, రీమేక్ సినిమా అయినా.. మోహన్ రాజా తన స్క్రీన్ ప్లే అండ్ ఎలివేషన్స్ తో మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. దీంతో చిరంజీవి ఈ దర్శకుడితో ఒక స్ట్రెయిట్ సినిమా చేస్తే బాగుండని అభిమానులు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు.
చిరంజీవికి సైతం మోహన్ రాజా వర్క్ నచ్చడంతో.. మరో ఛాన్స్ ఇచ్చేశారట. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. ఆ తరువాత చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమాకి టాలీవుడ్ రచయిత బివిఎస్ రవి కథని అందిస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నారట. మోహన్ రాజా కూడా స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొని చిరంజీవి కోసం ఒక మంచి కథని సిద్ధం చేయడానికి పని చేస్తున్నారట.
నేడు (మే 30) మోహన్ రాజా పుట్టినరోజు కావడంతో.. బివిఎస్ రవి విషెస్ తెలియజేస్తూ ఓ పోస్ట్ వేశారు. ఈ పోస్టుతో వీరిద్దరి కలయిక నిజమే అని తెలుస్తుంది. కాగా ఈ సినిమాని జూన్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. ఆగష్టు నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. గాడ్‌ఫాదర్ తో మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన మోహన్ రాజా.. ఈ సినిమాతో ఎలా ఆకట్టుకోబోతున్నారో చూడాలి.
Happy birthday my dear @jayam_mohanraja 💝 wish you achieve grand success in each of the endeavours❤️ pic.twitter.com/Crk7CcSFFD
— BVS Ravi (@BvsRavi) May 30, 2024