Site icon HashtagU Telugu

Chiranjeevi: చిరంజీవి మేడే గ్రీటింగ్స్.. చైల్డ్ లేబర్ పై వీడియో షేరింగ్

Chiru

Chiru

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మే డే సందర్భంగా ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. బాలకార్మిక వ్యవస్థ అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) చేస్తున్న ప్రచారం కోసం ఈ ప్రకటనను చిత్రీకరించినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో  చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ‘చిన్నిచేతులు’ పేరుతో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈ వీడియోను 22 ఏళ్ల క్రితం చిత్రీకరించామని తెలిపారు.

తన అభిమానులకు మే డే శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ‘బాలకార్మిక వ్యవస్థకు నో’ చెప్పాలని కోరారు. చిరంజీవి ఇప్పటికే టాలీవుడ్ కార్మికులు, నటుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దాసరి తర్వాత ఆయన టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారారు. సీనీ కార్మికుల కోసం తనవంతుగా పాటు పడుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.