Site icon HashtagU Telugu

Chiranjeevi Konidela: ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని  చేసింది

Chiranjeevi property

Chiru

Chiranjeevi Konidela: మెగాస్టార్ చిరంజీవి అనేక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన చేశారు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను టాలీవుడ్ కు అందించారు. అయితే చిరంజీవి ఎన్నో సూపర్ హిట్స్ సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క మూవీ మాత్రం ఆయనకు లైఫ్ ఇచ్చింది. ఆ మూవీనే ఖైదీ. ఈ మూవీ విడుదలై 40 సంవత్సరాలు అయిన స్పందర్భంగా చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.

‘‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని  చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని  ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని,  నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని  అభినందిస్తూ, అంత గొప్ప  విజయాన్ని  మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అంటూ చిరంజీవి స్పందించారు.