Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం పట్ల చిరు, తారక్ దిగ్భ్రాంతి!

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒడిశా రైలు ప్రమాద ఘటనపై స్పందిచారు.

Published By: HashtagU Telugu Desk
Ntr And Chiranjeevi

Ntr And Chiranjeevi

నిన్న అర్ధరాత్రి జరిగిన ఓడిశా రైలు ప్రమాదం ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన పలువురిని కలిచివేసింది. ఈ ప్రమాదంలో కనీసం 233 మంది మరణించారు.  900 మంది గాయపడ్డారు. ఒడిశా రైలు ప్రమాదంపై తెలుగు సూపర్ స్టార్స్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు.  చిరంజీవి మాట్లాడుతూ ఒడిశాలో విషాదకరమైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఊహించని ప్రాణనష్టం పట్ల  షాక్ తిన్నాను.  మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

‘‘ప్రాణాలను కాపాడేందుకు రక్తం అత్యవసరంగా అవసరమని నేను అర్థం చేసుకున్నాను అని ఆయన అన్నారు. రక్తదానం కోసం అన్ని విధాలా సహాయాన్ని అందించాలని మా అభిమానులందరికీ, సమీప ప్రాంతాలలోని గొప్ప వ్యక్తులకు ఇది విజ్ఞప్తి’’ అని చిరంజీవి అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ‘‘విషాద రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ విధ్వంసకర సంఘటన ప్రతిఒక్కరిపై ప్రభావితం చూపింది. ఈ క్లిష్ట సమయంలో ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులు బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నా’’ అని సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: Babu Delhi Tour: ఢిల్లీకి చంద్రబాబు, మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ?

  Last Updated: 03 Jun 2023, 12:26 PM IST