Chiranjeevi: రేటింగ్స్ పై చిరంజీవి ఇంట్రస్టింగ్ కామెంట్స్!

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా వాల్తేరు వీరయ్య మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.

  • Written By:
  • Updated On - January 23, 2023 / 04:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి వచ్చి వసూళ్లలో దుమ్ము లేపుతోంది. మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో జోరుగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక పండగ సీజన్ అయిన తర్వాత కూడా మంచి కలెక్షన్లతో థియేట్స్ లో ప్రదర్శితమవుతోంది వాల్తేరు వీరయ్య. అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా వాల్తేరు వీరయ్య మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే వాల్తేరు వీరయ్య సినిమాకు మొదట్లో కొంత మంది క్రిటిక్స్ నుంచి యూఎస్ లో అంతగా రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. ఈ సినిమాకు మరీ నాసిరకమైన రేటింగ్ వచ్చింది.

కేవలం 2.25-2.5 రేటింగ్ లు రావడంతో మూవీ టీమ్ కొంత నొచ్చుకుందనే చెప్పాలి. అయితే రాన్రాను వాల్తేరు వీరయ్య కలెక్షన్లు ఊపందుకున్నాయి. వీర సింహారెడ్డి పూర్తిగా రక్తపాతం ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ వాల్తేరు వీరయ్యకే జై కొట్టారు. అలా చిరు నటించిన సినిమా యూఎస్ లో మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే తాజాగా యూఎస్ అభిమానులతో మెగాస్టార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యూఎస్ లో అభిమానులతో జరిగిన ఈ మీటింగ్ లో చిరు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

వాల్తేరు వీరయ్య సినిమాకు యూఎస్ మార్కెట్ నుండి కేవలం 2.25-2.5 రేటింగ్ లు వచ్చింది. అయినా తర్వాత ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది. దీనిపై చిరు చేసి వ్యాఖ్యలు అభిమానులను ఉర్రూతలూగించాయి. వాల్తేరు వీరయ్యకు యూఎస్ లో కేవలం 2.25-2.5 రేటింగ్ లు ఇచ్చారని 2.25 ను రేటింగ్ గా భావించి అంతా నిరాశకు గురయ్యారని అయితే 2.25 మిలియన్ల డాలర్ల రెవెన్యూ అని అర్థం చేసుకోలేకపోయామని చిరు అన్నారు. అప్పుడు ఏదో అనుకున్నామని తీరా చూస్తే ఇప్పుడదే నెంబర్ తో అంతే మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చిందని సరదా సెటైర్ వేశారు.