Chiranjeevi : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో నితిన్, అర్జున్ ప్రధన పాత్రల్లో నటించిన సినిమా శ్రీ ఆంజనేయం. 2004లో రిలీజైన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే సినిమా ఎన్ని అంచనాలతో వచ్చిందో అంత ఫ్లాప్ అయ్యింది. ముఖ్యంగా శ్రీ ఆంజనేయం అని టైటిల్ పెట్టి ఛార్మి తో చేయించిన అతి ఇప్పటికీ ఆడియన్స్ కు రోత పుట్టించేస్తుంది.
ఐతే ఆ సినిమా గురించి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. ఈమధ్య తరచు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మీని అలా ఎందుకు చూపించారని ఒక నెటిజెన్ అడిగితే తప్పేనండి క్షమించండి అని ఆన్సర్ ఇచ్చాడు.
ఈ క్రమంలో శ్రీ ఆంజనేయం సినిమాలో అర్జున్ చేసిన హనుమంతుడి రోల్ ని చిరంజీవితో చేయించాలని అనుకున్నామని.. ఐతే అప్పటికే శ్రెమంజునాథ రావడం రిజల్ట్ చిరంజీవిని శ్రీ ఆంజనేయం పై అంత ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆయన కాదన్నాక అర్జున్ సర్జా ఈ సినిమాలోకి వచ్చారని చెప్పారు.
జస్ట్ ఇమాజిన్ శ్రీ ఆంజనేయం సినిమాలో చిరంజీవి చేసి ఉంటే ఎలా ఉండేది అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి చేసినా సినిమా రిజల్ట్ అంతగా తేడా ఉండేది కాదని కొందరు అంటున్నారు. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేస్తే ఒక్కోసారి రిజల్ట్ తారుమారు అవుతుంది. శ్రీ ఆంజనేయం చిరంజీవి చేసి ఉంటే దాని ఫలితం ఎలా ఉండేదో కానీ నితిన్, అర్జున్ సర్జాల కాంబో బాగున్నా సినిమా మాత్రం ఆడియన్స్ కు రుచించలేదు.