Site icon HashtagU Telugu

Bhola Shankar : పవర్ స్టార్‌ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్.. భోళా శంకర్ నుంచి ఫ్యాన్స్ కోసం అదిరిపోయే చిరు లీక్స్..

Chiranjeevi Imitates Pawan Kalyan in Bhola Shankar Movie

Chiranjeevi Imitates Pawan Kalyan in Bhola Shankar Movie

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస సిసినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తమన్నా(Tamannaah) హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. ఇందులో కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తుండగా హీరో సుశాంత్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్ ప్రేక్షకులని మెప్పించాయి. ఇక చిరంజీవి అప్పుడప్పుడు చిరు లీక్స్ అంటూ తన సినిమాల గురించి ముందే అప్డేట్స్ ఇస్తూ ఉంటాడని తెలిసిందే. తాజాగా మరోసారి భోళా శంకర్ సినిమా నుంచి చిరు లీక్స్ చేశారు చిరంజీవి.

చిరంజీవి తన సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో.. ఎప్పటిలాగే చిరు లీక్స్ తో మీ ముందుకి వచ్చాను. భోళా శంకర్ సినిమా గురించి మీకు అదిరిపోయే అప్డేట్ ఇస్తున్నాను. మా డైరెక్టర్ మెహర్ రమేష్ తిట్టుకున్నా పర్లేదు. ఇన్నాళ్లు తమ్ముడు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో నా ఫోటోలు, నా సాంగ్స్, నా డైలాగ్స్ వాడి, నన్ను ఇమిటేట్ చేసి అభిమానులని అలరించాడు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ భోళా శంకర్ సినిమాలో అలరించబోతున్నాను అంటూ తెలిపాడు.

ఇక వీడియోలో పవన్ కళ్యాణ్ ఏ మేరా జహాఁ సాంగ్ చిన్న బిట్ ప్లే చేసి, పవన్ లాగా మెడ మీద చెయ్యి వేసి అలరించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. మెగాస్టార్ పవర్ స్టార్ ని ఇమిటేట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సెకన్ ఇలా చేస్తేనే అంతా ఆశ్చర్యపోతుంటే ఇక సినిమాలో ఇలాంటివి ఎన్ని సీన్స్ ఉన్నాయో అని మెగా అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ చిరు లీక్స్ తో ఒక్కసారిగా ఫ్యాన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేశారు.