Site icon HashtagU Telugu

Chiranjeevi: బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ కు ఆంధ్ర భోజనం రుచి చూపించిన చిరంజీవి?

Chiranjeevi

Chiranjeevi

బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ తాజాగా టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ భారతదేశాలకు చెందిన పలు అంశాల గురించి వారు చర్చించుకున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో యూకే కి ఉన్న అనుబంధం గురించి వారు మాట్లాడుకున్నారు. అనంతరం గారెత్ విన్ ఓవెన్ కు మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు..

హైదరాబాదులోని బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్ తో బేటి కావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మంచి వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో మేము బ్రిటన్ భారత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాల అభిప్రాయాలను పరస్పరం చర్చించుకున్నాము.. నా నివాసంలో ఆయనకు కొన్ని తెలుగు సాంప్రదాయ వంటకాలతో విందును ఏర్పాటు చేశాను.. ఆవకాయను మాత్రం మర్చిపోలేదండోయ్ అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

ఇకపోతే గారెత్ వైన్ ఒవేన్ గత నెల అనగా సెప్టెంబర్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల వ్యవహారాలను చూసేందుకు కగాను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించారు. బ్రిటన్ తో ఈ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాపార సంబంధాలను మెరుగుపరిచే బాధ్యత ఆయనపై ఉంది. వ్యాపార రంగాలతో పాటుగా విద్యారంగంలో కూడా తెలుగు రాష్ట్రాలతో అనేక కార్యక్రమాలను రూపొందించనున్నారు.

 

Exit mobile version